స్నేహానికి సంబంధించి, తెలుగులో చాలానే సినిమాలొచ్చాయి. వాటన్నింటికీ భిన్నంగా సాగే స్టోరీతో తెరకెక్కుతోన్న చిత్రమే 'ఉన్నది ఒక్కటే జిందగీ'. టైటిల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తోన్న డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. రామ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాకి హీరోయిన్‌గా మేఘా ఆకాష్‌ని అనుకున్నారు. కానీ ఆ ముద్దుగుమ్మ హ్యాండ్ ఇవ్వడంతో లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది. స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే స్టోరీ ఇది. శ్రీ విష్ణు కీలక పాత్రలో నటిస్తున్నాడు. యూత్‌కి మంచి మెసేజ్ ఇస్తూనే సూపర్బ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ అంటే సెన్సేషనే. గతంలో 'నేను శైలజ' సినిమాతో మంచి హిట్ కొట్టారు ఈ ఇద్దరూ. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ దాంతో పాటు మంచి లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంటునీ చూపించాడు ఈ సినిమాలో కిషోర్ తిరుమల. అలాగే అంతకు మించిన సెంటిమెంట్ ఏదో ఈ సినిమాలో ఉండబోతోందట. అది ఏంటో ప్రస్తుతానికి సస్పెన్సేనట. కానీ దాన్ని సెంటిమెంట్‌లా కాకుండా ఎంటర్‌టైనింగ్ వేలో చూపించబోతున్నాడట కిషోర్ తిరుమల. లవ్‌తో పాటు, వినోదం కూడా పుష్కలంగా ఉండబోతోందట ఈ సినిమాలో.
|