ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఉంది. ఎస్ ఇట్స్ నాట్ ఎ లై. ఇట్స్ ట్రూ ఎవరీ భామ అనుకుంటున్నారా? అదేనండీ 'లై' బ్యూటీ మేఘా ఆకాష్. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో ఇదే తొలి సినిమా. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా సినిమా విడుదల కాకముందే అమ్మడు సెన్సేషన్ అయిపోయింది.
'లై' సినిమాలో నితిన్‌కి జోడీగా నటిస్తోంది. కొత్త పిల్లే అయినా కానీ, ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నదానిలా తన యాక్టింగ్ టాలెంట్ ప్రదర్శిస్తోందట. ఆమె టాలెంట్‌కి చిత్ర యూనిట్ ఎంతో ముచ్చట పడిపతోందట. ఆ ముచ్చటతోనే తన తర్వాతి సినిమాకి కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఇద్దరికీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్‌గా సెట్ అయ్యిందట. రొమాంటిక్ సీన్స్‌లో చాలా నేచురల్‌గా నటించిందట ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఆగష్టు 11న 'లై' ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మ సందడి ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సినిమా వచ్చాక ఇంకే రేంజ్‌లో పొగిడేస్తారో ఊహించడమే కష్టంగా ఉంది. ఇంకా అమ్మడి స్క్రీన్ ప్రెజెన్స్ చూడక ముందే బోలెడంత బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తోన్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. అయితే లాస్ట్ మినిట్‌లో డేట్స్ అడ్జస్ట్ కాక ఆ ఛాన్స్ వదిలేసుకుందంటే ఈ బ్యూటీ ఎంత బిజీనో చూడండి.
|