నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'యుద్ధం శరణం'. 'రారండోయ్ వేడుక చూద్దాం' అంటూ వచ్చి సైలెంట్‌గా హిట్ కొట్టుకెళ్లిపోయాడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య. మళ్లీ అదే జోరుతో హిట్ కోసం యుద్ధం చేస్తానంటున్నాడు ఈ సినిమాతో చైతూ. 'యుద్దం శరణం' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి చైతూతో జత కడుతోంది. అప్పుడు తండ్రి నాగార్జునతో ఇప్పుడు కొడుకు చైతూతో జత కట్టే బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే ఈ సినిమా టీజర్ వచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తుండడం విశేషం. అందులోనూ చాలా పవర్ ఫుల్ విలన్‌గా శ్రీకాంత్ అప్పియరెన్స్ ఉంది ఈ సినిమాలో. టీజర్‌లో అది బాగా హైలైట్ చేశారు. అంటే ఈ సినిమాలో చైతూ యాక్షన్ శ్రీకాంత్‌తో చాలా గట్టిగానే చేయబోతున్నాడన్న మాట. ఇంతకు ముందు 'బెజవాడ', 'దడ', తడాఖా' వంటి చిత్రాల్లో చైతూ యాక్షన్ ఇరగదీసేశాడు. అయితే ఈ సినిమాలో ఓ డిఫరెంట్ యాక్షన్‌ని పరిచయం చేయబోతున్నాడట. ఆర్. వి. కృష్ణ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుస విజయాలతో దూకుడు కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య. ఇదే జోరు ఈ సినిమాకీ కొనసాగించేలానే ఉన్నాడు. త్వరలోనే సమంతని పెళ్లి చేసుకోబోతున్నా చైతూకి సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుతుండడం సంతోషించదగ్గ విషయమే.
|