Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

లై చిత్ర సమీక్ష

lie movie review

చిత్రం: లై 
తారాగణం: నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్‌, శ్రీరామ్‌, అజయ్‌, నాజర్‌, రవికిషన్‌, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్‌, బ్రహ్మానందం తదితరులు. 
సంగీతం: మణిశర్మ 
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌ 
దర్శకత్వం: హను రాఘవపూడి 
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర 
నిర్మాణం: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
విడుదల తేదీ: 11 జులై 2017 


క్లుప్తంగా చెప్పాలంటే 
మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ (పద్మనాభం)ని పట్టుకోవడానికి ఇండియన్‌ పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఓ సందర్భంలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటాడు పద్మనాభం. అమెరికాలో ఉండే పద్మనాభంని పట్టుకునేందుకు 19 ఏళ్ళ తర్వాత అవకాశం వస్తుంది. ఇంకో వైపున ఎ.సత్యం (నితిన్‌)కి అమెరికా అంటే అదో క్రేజ్‌. వేగాస్‌కి వెళ్ళిపోయి, అక్కడే ఓ అమ్మాయిని పెళ్ళాడి సెటిలైపోవాలనుకుంటాడు. ఎ.సత్యం లాగానే వేగాస్‌ వెళ్ళి, డబ్బు సంపాదించాలనుకునే పిసినారి చైత్ర (మేఘా ఆకాష్‌). ఇద్దరూకలిసి వేగాస్‌ వెళతారు. చైత్ర, సత్యం మధ్య సంబంధమేంటి? పద్మనాభంకీ సత్యంకీ లింకేంటి? అమెరికాలో సత్యం ఏం చేస్తాడు? పద్మనాభం పోలీసులకు దొరికాడా లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.


మొత్తంగా చెప్పాలంటే 
సినిమా సినిమాకీ నితిన్‌ కొత్తగా కన్పిస్తున్నాడు. డైలాగ్‌ డెలివరీ, డాన్సులు, యాక్షన్‌, బాడీ లాంగ్వేజ్‌ - ఇలా ఒకటేమిటి? అన్నిటిలోనూ కొత్తదనం ప్రదర్శిస్తున్నాడు. ఈ సినిమాతో నితిన్‌ మరింత పరిణతి సాధించాడు. చాలా స్టైలిష్‌గా సత్తా చాటాడు. డాన్సులేంటి? డైలాగులేంటి? యాక్షన్‌ ఏంటి? అన్నిటిలోనూ తనదైన మార్క్‌ ఖచ్చితంగా పడేలా చూసుకున్నాడు. ఎ.సత్యం పాత్రకి నూటికి నూరుపాళ్ళూ న్యాయం చేశాడు. 
మేఘా ఆకాష్‌కి ఇదే తొలి తెలుగు సినిమా. తొలి సినిమా అయినా చక్కగా నటించింది. నితిన్‌, మేఘా ఆకాష్‌ జంట తెరపై చూడ్డానికి చాలా బాగుంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సీనియర్‌ నటుడు అర్జున్‌ ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్‌. దర్శకుడు తీర్చిదిద్దిన పాత్రలో అర్జున్‌ ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి తన పాత్రకు సూపర్‌ స్టైలిష్‌ అప్రోచ్‌ ఇచ్చాడు అర్జున్‌. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 
ఖచ్చితంగా ఇది కొత్త కథే. కథనం ఇంకా జాగ్రత్తగా ప్లాన్‌ చేయడాన్ని అభినందించాల్సిందే. డైలాగ్స్‌ బాగున్నాయి. అక్కడక్కడా లాజిక్స్‌ మిస్‌ అయినట్లు అన్పించడం కొంత మైనస్‌. మ్యూజిక్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. సినిమాటోగ్రఫీ అద్భుతం. సాంకేతిక విభాగం నుంచి దర్శకుడికి మంచి సపోర్ట్‌ లభించింది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని నైజం కన్పిస్తుంది. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి బాగా కుదిరాయి. ఎడిటింగ్‌ బాగుంది. అక్కడక్కడా ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. 
స్టైలిష్‌ ఫిలింగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు శ్రమించాడు. సాంకేతిక వర్గం నుంచి ఫుల్‌ సపోర్ట్‌ దర్శకుడికి లభించింది. ట్విస్ట్‌లు బాగా సెట్‌ చేసుకున్నాడు దర్శకుడు. ఓవరాల్‌గా సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్పిస్తుందిగానీ, ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ మిస్‌ అయ్యాయి. ఆ ఒక్కటీ కాస్త లోటు అనిపిస్తుంది. టిపికల్‌ సన్నివేశాలు మాస్‌ ఆడియన్స్‌కి కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం మామూలే. ఓవరాల్‌గా సినిమాని చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కొత్త తరహా ఆలోచనలే కాదు, ఆ ఆలోచనల్ని ఎగ్జిక్యూట్‌ చేయడంలోనూ సత్తా చాటడం చిన్న విషయం కాదు. డిఫరెంట్‌ మూవీ చూశామనే అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. 


ఒక్క మాటలో చెప్పాలంటే 
స్టైలిష్‌ ఫిలిం ఇట్స్‌ నాట్‌ 'లై' 


అంకెల్లో చెప్పాలంటే: 3/5 

మరిన్ని సినిమా కబుర్లు
nene raju nene mantri movie review