రొటీన్‌కి భిన్నంగా ఫస్ట్ ఇంపాక్ట్‌తో అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ, సినీ పరిశ్రమనీ ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. టీజర్, ట్రైలర్ అనే పేర్లు సర్వ సాధారణమే సినీ పరిశ్రమలో. అందుకే, కొంచెం కొత్తగా పూరీ జగన్నాధ్ 'పైసా వసూల్' సినిమాతో స్టంపర్ అనే పేరు తీసుకొచ్చాడు. అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య' కోసం దర్శకుడు వక్కంతం వంశీ ఇంకొంచెం కొత్తగా ఆలోచించి 'ఫస్ట్ ఇంపాక్ట్' అంటూ సినిమా ప్రోమోని రిలీజ్ చేశారు. అది బాగా వర్కవుట్ అయ్యింది. ఫస్ట్ ఇంపాక్ట్ అదిరిపోయేలా రూపొందించరు. అలా సినిమాపై అంచనాల్ని పెంచేశారు. స్టార్ రైటర్‌గా తెలుగు సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీకి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. ఫస్ట్ ఇంపాక్ట్‌లో అల్లు అర్జున్ వన్ మేన్ షో కనిపిస్తే, దర్శకుడి టెక్నికల్ బ్రిలియన్సీ కూడా హైలైట్ అయ్యింది.
షార్ట్ మేకింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. హీరో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ గురించి ప్రతీ ఒక్కరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. డైలాగ్ డెలివరీ, హీరోయిజం అంతా ఈ ఫస్ట్ ఇంపాక్ట్‌తోనే పవర్ ఫుల్‌గా చూపించేశాడు అల్లు అర్జున్. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ ట్రై చేశాడు. ఆ గెటప్ బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. హరీష్ శంకర్‌తో గతేడాది 'డీజె - దువ్వాడ జగన్నాధమ్'తో ఫర్వాలేదనిపించాడు. కానీ ఈసారి అలా కాదు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో బాక్సాఫీస్ బద్దలయ్యేలా వసూళ్ల ప్రభంజనం సృష్టించనున్నాడనీ అంతా ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|