బాలయ్యను సంక్రాంతి కోడిపుంజు అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. వరుసగా మూడోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు బాలయ్య 'జై సింహా' సినిమాతో. 2016 సంక్రాంతికి 'డిక్టేటర్' సినిమాతో వచ్చారు. గతేడాది సంక్రాంతికి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు బాలయ్య. 'శాతకర్ణి' పూర్తిగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. బాలయ్య ప్రయత్నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మంచి విజయం కట్టబెట్టారు. ముచ్చటగా మూడోసారి ఇప్పుడు పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో 'జై సింహా'గా బరిలోకి దిగబోతున్నాడు బాలయ్య. బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న 'జై సింహా' చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాతో ఖచ్చితంగా బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టేలానే ఉన్నాడు. అంతలా ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చేస్తోంది. బిజినెస్ పరంగానూ బాలయ్య 'జై సింహా'తో ప్రీ రిలీజ్ గణాంకాలు సూపర్బ్ అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 15 కోట్ల వరకూ శాటిలైట్ బిజినెస్ జరిగిందట. మొత్తం ప్రీ రిలీజ్ లెక్కల ప్రకారం బాలయ్య కెరీర్‌లోనే ఈ సినిమా ఓ రికార్డ్ అని అంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే, బాలయ్య ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయమే అనిపిస్తోంది. ఓ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అయిన 'శాతకర్ణి' సినిమాతోనే హిట్ కొట్టిన బాలయ్య, సంక్రాంతికి తగ్గ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాడంటే బాక్సాఫీస్ వసూళ్ళ పండగే అనుకోవాలి. బాలయ్యకి మాస్ ఆడియన్స్‌లో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఆ మాస్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలు నయనతార, నటాషా జోషీ, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలయ్య సరసన. పంచ్ డైలాగ్స్, యాక్షన్ ఎలిమెంట్స్, మాస్ మెచ్చే డాన్స్ స్టెప్పులు అహో భళా అనిపించనున్నాడు 'జై సింహా'తో బాలయ్య ఈ సంక్రాంతికి.
|