పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా' అప్పట్లో పెద్ద హిట్. 'అత్తారింటికి దారేది' సూపర్ హిట్. తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' ఎలాంటి సంచనలనాలకు దారి తీస్తుందో. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారు వంద కోట్లు పైనే ఈ సినిమాకి బిజినెస్ అయ్యిందనీ సమాచారమ్. పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన 'సర్దార్ గబ్బర్‌సింగ్', 'కాటమరాయుడు' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, 'అజ్ఞాతవాసి' సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టనుందనీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఓవర్సీస్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పనక్కర్లేదు. అక్కడ రికార్డు స్థాయి ధియేటర్స్‌లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ చిత్రం. 'అజ్ఞాతవాసి'కి సంబంధించి బోలెడన్ని ప్రత్యేకతలున్నాయి. కాంబినేషన్ క్రేజ్ ఓ పక్క. అనిరుధ్ మ్యూజిక్ మరో పక్క కొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. అన్నింటికీ మించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన 'కొడకా.. కోటేశ్వరరావు' పాటకి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది. పవన్‌కళ్యాణ్ పాడిన పాట ఇది. మిగతా సాంగ్స్ సైతం చార్ట్ బస్టర్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాయి.
ఆడియోకీ, ప్రోమోస్‌కీ రెస్పాన్స్ ఇంతలా అదిరిపోతోంటే, సినిమా ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో! అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ పవన్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్, కీర్తి సురేష్ యాక్టింగ్ టాలెంట్ అన్నీ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో పవన్‌ని త్రివిక్రమ్ చూపించనుండడం ఇంకో ప్రత్యేకత. 'వీడి చర్యలు ఊహాతీతం..' అని టీజర్‌లో విన్పిస్తోన్న డైలాగ్‌లానే, సినిమా విడుదలయ్యాక నమోదు చేసే సంచలనాలు వర్ణనాతీతం అనేలా ఉంటాయేమో చూడాలిక.
|