'రంగస్థలం' సినిమాలో అనసూయ రంగమ్మత్తగా నటించింది. ఈ పాత్ర అనసూయకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా మంచి విజయం సాధించడమే కాదు, 'రంగమ్మత్త' పాత్రకు ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉండడం, ఆ పాత్రకు అనసూయ పూర్తి న్యాయం చేయడంతో 'రంగమ్మత్త' పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. ఇంతవరకూ గ్లామరస్ బ్యూటీగానే పేరు తెచ్చుకున్న అనసూయలో 'రంగమ్మత్త' క్యారెక్టర్‌తో చాలా మార్పులు వచ్చాయట. అనసూయకు గ్లామరే కాదు, కొంచెం కోపం కూడా ఎక్కువే. ఆ కోపం ఈ సినిమాతో బాగా తగ్గిపోయిందట. అంతేకాదు, ఐటెం సాంగ్స్‌కీ, గ్లామరస్ క్యారెక్టర్స్‌కీ మాత్రమే తాను సూటవుతాననుకున్న అనసూయ ఆలోచనలు ఈ సినిమాతో మారిపోయాయట కూడా. అవును నిజమే 'రంగమ్మత్త'గా అనసూయ పోషించిన పాత్రకు నిజంగానే అందం తెచ్చింది అనసూయ. చాలా చోట్ల హీరోయిన్‌గా నటించిన సమంత క్యారెక్టర్‌ని కూడా అనసూయ పాత్ర డామినేట్ చేసేసింది.
అంతేకాదు, సినిమా ప్రమోషన్స్‌లో కూడా అనసూయ అత్యుత్సాహంగా పాల్గొంది. ముఖ్యంగా సమంత 'రంగస్థలం' షూటింగ్ తర్వాత భరత్త చైతో కలిసి విహార యాత్రలకు వెళ్లడంతో, 'రంగస్థలం' ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోయింది. దాంతో ఆ ప్లేస్‌ని కూడా ఆనసూయే ఆక్కుపై చేసేసి, మరింత పాపులర్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఎలాంటి విభిన్న పాత్రకైనా తాను సూటవుతానన్న నమ్మకం కలిగిందంటోంది అనసూయ. 'బుల్లితెరపై హాట్ బ్యూటీగానే కొనసాగుతాను. కానీ వెండితెరపై మాత్రం మరిన్ని అద్భుతాలు సృష్టించాలని ఉంది..' అని చెబుతోంది మన అందాల రంగమ్మత్త.
|