గత కొన్నిరోజులుగా పలువురు సినీ ప్రముఖుల మీద ఆరోపణలు చేస్తోంది సినీ నటి శ్రీరెడ్డి. ప్రముఖ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, పలువురు హీరోలపై కూడా ఈమె విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ హాట్ లేడీ విజృంభన మొదలెట్టింది. దీనికి ఆమె పెట్టుకున్న పేరు సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై జరుగుతున్న అరాచకాలపై తాను చేపట్టిన 'పోరాటం' అని పేరు పెట్టింది. ఈ పోరాటంలో తన వద్ద చాలా మంది సినీ ప్రముఖుల జాతకాలున్నాయంటూ బజారుకెక్కింది. మామూలుగా ఆరోపణలు చేస్తే పెద్దగా పట్టించుకోవల్సిన పని లేదు. అత్యంత హీనంగా, జుగుప్సాకరంగా మాట్లాడుతూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తోంది,
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈమె ఆరోపణలకు స్పందించిన ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ తరహా ఆరోపణలను వెనక్కి తీసుకోకుంటే, చట్ట పరంగా యాక్షన్ తీసుకోవల్సి వస్తుందనీ ఈమెకు సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా శ్రీరెడ్డి ఏమాత్రం లొంగడం లేదు. ఇంకా బరితెగించిపోతోంది. తనచే ఆరోపించబడిన వారికి సంబంధించిన కంప్లీట్ ఎవిడన్స్ ఉన్నాయంటోంది. వారెవరో తమంతట తాముగా బయటికి వచ్చి, సినీ ఇండస్ట్రీలో జరుగతున్న ఈ అరాచకాలు, అత్యాచారాలపై అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయకుంటే, మరో వారం రోజుల్లో నగ్నంగా నిరసన చేస్తాననీ పబ్లిగ్గా నిస్సిగ్గుగా మాట్లాడుతోంది. తనలాంటి అమ్మాయిల్ని వేధింపులకు గురి చేసిన ఆ సినీ ప్రముఖులు స్పందించకుంటే, ఫిల్మ్ నగర్ నడి బజార్లో బట్టలిప్పేసి నిలుచుంటాననీ శ్రీరెడ్డి చెబుతోంది. ఇంత దారుణంగా ఆరోపణలు చేస్తున్న ఈ శ్రీరెడ్డి వెనక ఉన్నది ఎవరసలు? ఓ సాధారణ నటికి ఎక్కడి నుండి వచ్చిందీ ధైర్యం, తెగువ అని ఆశ్చర్యపోతున్నవారు కొందరైతే, శ్రీరెడ్డికి సమ్‌థింగ్ సైకలాజికల్ ప్రోబ్లమ్ ఏదో ఉందనీ అందుకే ఇలా బరితెగించేసిందనీ లైట్ తీసుకుంటున్నవారు కొందరున్నారు.
|