మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కష్టం ఫలించింది. సుకుమార్ ప్రయోగం విజయవంతమైంది. 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అలాంటి ఇలాంటి హిట్ కాదు. ఏ చిన్న లోటు కనిపించలేదు సినిమాలో. అందుకే అన్ని వర్గాల వారినీ ఈ సినిమా అంతగా మెప్పించింది. రామ్‌చరణ్ వన్ మేన్ ఆర్మీలా కనిపించాడు సినిమాలో. చిట్టిబాబు పాత్రలో చరణ్ యాక్టింగ్ నభూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉంది. అందుకే వీళ్లూ వాళ్లూ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్క సినీ ప్రముఖుడూ 'రంగస్థలం'ని, చిట్టిబాబు పాత్రలో చరణ్‌ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది 'రంగస్థలం'. విడుదలైన రెండు రోజులకే రికార్డు స్థాయిలో 'రంగస్థలం' వసూళ్లు నిలిచాయి. వారాంతానికే 125 కోట్ల గ్రాస్ దాటేసింది 'రంగస్థలం'. ఇంతవరకూ ఓవర్సీస్‌లో మార్కెట్ లేని చరణ్‌కు 'రంగస్థలం'తో ఆ లోటు కూడా తీరిపోయింది. ఒక్క రోజులోనే మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరిపోయింది అక్కడ. ఈ సినిమాతో ఓవర్సీస్‌లో కూడా రికార్డులు కొల్లగొట్టేశాడు మన చిట్టిబాబు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'రంగస్థలం'. అంచనాలను మించి విజయాన్ని అందుకుంది. చరణ్ - సమంత ఈ సినిమాలో తొలిసారిగా జత కట్టారు.
చిట్టిబాబుగా చరణ్‌కీ, రామలక్ష్మి పాత్రలో సమంతకు కెరీర్‌లో మర్చిపోలేని ఓ అనుభూతిగా 'రంగస్థలం' నిలిచిపోనుందని చెప్పొచ్చు. దేవిశ్రీ అందించిన బాణీలకు లుంగీ కట్టి చిట్టిబాబు వేసిన స్టెప్పులకు ధియేటర్ అంతా మార్మోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఒక్కటేమిటి 'రంగస్థలం' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందది.
|