'పెళ్లిచూపులు' వంటి చిన్న సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన హీరో విజయ్ దేవరకొండ. తర్వాత 'అర్జున్‌రెడ్డి'తో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో అందరి నోళ్లలోనూ తెగ నానేశాడీ యంగ్ హీరో. డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో పక్కా తెలంగాణా యాసతో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ సేమ్ మేనరిజమ్‌తో యూత్‌కి క్రేజీయెస్ట్ హీరో అయిపోయాడు. ఆ క్రేజ్‌తోనే వరుస ఛాన్సులు అందుకుంటూ బిజీయెస్ట్ హీరోగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు, నాలుగు సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో 'టాక్సీవాలా', 'ఏ మంత్రం వేశావె' చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మరో సినిమా 'నోటా' నిర్మాణంలో ఉంది. ప్రతిష్ఠాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సంస్థ విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా తాజాగా మరో చిత్రం లైన్‌లోకి వచ్చింది. అదే 'గీత గోవిందం'. అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టిన పరశురాం డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా టైటిల్‌ని అనౌన్స్ చేశారు. టైటిల్ చాలా ట్రెడిషనల్‌గా, క్యాచీగా ఉంది. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? రష్మికా మండన్నా. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి సినిమాకే సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో మరో హిట్‌కి రెడీ అయిపతోందనే అనుకోవాలి. ఇకపోతే విజయ్ దేవరకొండ ఇటీవల 'మహానటి' చిత్రంతో ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
|