మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం చాలా బిజీ. ఓ పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తూ, సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నాడు. నిర్మాతగా అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, తండ్రి చిరంజీవితో రూపొందిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చరణ్ చేతుల్లో ఉంది. ఈ సినిమా విషయంలో చరణ్ అస్సలు రాజీపడడం లేదట. ఇండియన్ సినిమాకి సంబంధించిన పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, తనకు 'రంగస్థలం' సినిమాతో హీరోగా లభించిన స్టార్‌డమ్ దృష్ట్యా తదుపరి చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
బోయపాటితో చరణ్ చేయబోయే చిత్రంపైనన్న మాట. ఈ సినిమానిఇ సంక్రాంతికి రిలీజ్ చేసేలా కన్‌ఫామ్ చేశాడు చరణ్. తన నిర్మాణంలో వస్తున్న 'సైరాని నెక్ట్స్ రేస్‌లో అంటే సమ్మర్‌కి రిలీజ్ చేయనున్నాడు. మరోవైపు ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్‌ని లైన్‌లో పెట్టాడు. నవంబర్ తర్వాత ఏ క్షణంలోనైనా రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది. ఇలా చరణ్ టేకప్ చేసిన ఈ అన్ని సినిమాలూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. సో పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఓ సినిమా షూటింగ్, ఇంకో సినిమా ప్రమోషన్స్‌కి అడ్డు కాకూడదు. అందుకే ఫస్ట్ బోయపాటి సినిమా ప్రమోషన్స్‌ని డిశంబర్ నుండీ ప్లాన్ చేశాడట. మధ్య మధ్యలో రాజమౌళి మల్టీ స్టారర్ కోసం షూటింగ్‌లో పాల్గొననున్నాడట. తర్వాత 'సైరా' ప్రమోషన్స్ షురూ చేస్తాడట. ప్లాన్ అదిరిందిగా. మెగా పవర్‌స్టారా..మజాకానా.!
|