నాని సినిమాల్లో ఏముంటాయ్.. పక్కింటి కుర్రోడు కనిపిస్తాడు. ఆ కుర్రోడు చేసే సందడిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కత్తిమీద సాము లాంటి వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటాడీ పక్కింటబ్బాయ్. బుల్లితెరపైనా అదే చేస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా ప్రతీ ఇంటికి చేరువైపోతున్నాడు. ఫస్ట్‌వీకెండ్ అదరగొట్టేశాడు. అంతకు ముందు ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌తో నానిని పోల్చలేం. యంగ్ టైగర్ స్టార్‌డమ్ వేరు, నాని స్టార్‌డమ్ వేరు. ఏమాత్రం ఎక్కువ చేసినా అతి అనిపించుకుంటాడు. ఆ హద్దులు నానికి బాగా తెలుసు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. వంద రోజులకు పైగా షోని నడిపించాల్సిన బాధ్యత నానిపై ఉంది.
ఇంకా చాలా వీకెండ్స్ ఉన్నాయి. క్రమ క్రమంగా డోస్ పెంచుకుంటూ, బుల్లితెరపై తనదైన స్టార్‌డమ్ చూపించాలనుకుంటున్నాడట నాని. ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే, సెకండ్ సీజన్‌లో వివాదాలు ఎక్కువగా ఉండొచ్చు. ఫస్ట్ ఎలిమినేషన్‌లో బయటికి వచ్చిన సంజన షో నిర్వాహకుల పైనా, హోస్ట్ నాని పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ 1 విషయంలో ఇలాంటివేమీ జరగలేదు. దానికి కారణం యంగ్‌టైగర్ ఇమేజ్ కూడా కావచ్చు. అందుకే ఎన్టీఆర్‌తో పోల్చితే నానిపై ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని, రెగ్యులర్‌గా షోని ఫాలో అవుతూ, వీకెండ్‌లో కాన్ఫిడెంట్‌గా షో నడపడమంటే, అంత ఆషామాషీ కాదండోయ్ నానీ గారూ..!
|