మాస్ డైరెక్టర్ సంపత్‌నంది నిర్మాణ సారధ్యంలో రూపొందుతోన్న చిత్రం 'పేపర్‌బోయ్'. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని డైలాగులు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయంటూ, ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా, ప్లెజెంట్‌గా ఉందని సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇకపోతే ట్రైలర్‌లో డైలాగ్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా హీరో సంతోష్ శోభన్ ఈ ట్రైలర్ ద్వారా ముద్దుకు కొత్తర్ధం చెప్పాడు. 'ముద్దంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం' అని సంతోష్ చెప్పిన డైలాగ్‌కి నిజంగానే హృద్యంగా ఉంది. ఇలాంటి డైలాగులు ట్రైలర్‌లో మచ్చుకు కొన్ని చూపించినా సినిమాలో చాలానే ఉన్నాయి. బీటెక్ చేసి పేపర్ బోయ్‌లా పనిచేస్తున్నావా? అని అడిగితే, ఇది బతకడం కోసం. అది భవిష్యత్ కోసం, అని చెప్పి, అక్కడే మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ట్రైలర్ ద్వారా మరోసారి టచ్ చేశాడు. అందుకే సూపర్‌స్టార్‌ని మెప్పించాడు. సంపత్‌నంది హ్యాండ్ ఉండడంతో సినిమాపై అంచనాలున్నాయి. అంతేకాక ఈ మధ్య చిన్న సినిమాలు అనూహ్యంగా భారీ విజయం అందుకుంటున్నాయి. ఆ కేటగిరిలోకి 'పేపర్‌బోయ్' కూడా చేరేలానే ఉంది. చూడాలి మరి.
|