సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల డెహ్రాడూన్ ముఖ్యమంత్రిని మహేష్ కలిసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మహేష్‌బాబుకు 25వ చిత్రం కావడం విశేషం. ఇకపోతే మహేష్‌బాబు ఇటీవల 'భరత్ అనే నేను' సినిమాతో సంచలన విజయం అందుకున్నారు. 'భరత్' విజయం దృష్ట్యా మహేష్ 25వ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. 'భరత్' వసూళ్ల దృష్ట్యా తాజా చిత్రం విషయంలో డైరెక్టర్ వంశీపై అతి పెద్ద బాధ్యత పడిందనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్‌బాబును సరికొత్త లుక్‌లో చూపించబోతున్నాడు వంశీ పైడిపల్లి.
ఇంతవరకూ గెటప్ విషయంలో అస్సలు సాహసం చేయని మహేష్‌బాబు టాలీవుడ్‌లో మారిన ఈక్వేషన్స్ పరంగా ఈ సారి సాహసం చేయక తప్పడం లేదు. కథ పరంగా, ఈ సినిమాకి ఆ గెటప్ అవసరమైందట కూడా. 'భరత్' సినిమా తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన మహేష్‌బాబు, ఇటీవలే కొత్త లుక్‌తో ఇండియాకి తిరిగొచ్చాడు. లేటెస్టుగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. కాగా ఈ చిత్రంలో మహేష్ సరసన హాట్ బ్యూటీ పూజాహెగ్దే నటిస్తోంది. వీలైనంత తొందర్లోనే ఈ సినిమాని పూర్తి చేసి, సుకుమార్‌తో సినిమా కోసం రెడీ కానున్నాడు మహేష్‌బాబు. 'స్పైడర్' సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్న మహేష్‌బాబు ఇకపై జోరు పెంచనున్నాడనీ తెలుస్తోంది.
|