బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్'. మొదట్లో తేజ దర్శకత్వంలో మొదలైన ఈ బయోపిక్ ఇప్పుడు క్రిష్ చేతికొచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ చేతికొచ్చాక సినిమా షూటింగ్ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే కథపై ఓ క్లారిటీకొచ్చేశాడు క్రిష్. ఇక ఇంతవరకూ ఈ బయోపిక్‌లో బాలయ్య తప్ప మరే ఇతర కాస్టింగ్ పైనా క్లారిటీ లేదు. తాజాగా ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకు గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేరు దాదాపు ఖరారు చేసేశారట. ఇకపోతే ఎన్టీఆర్ బయోపిక్ అంటే సీనియర్ నటీనటుల పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు యంగ్ స్టర్స్‌ని ఆయా పాత్రల కోసం పరిశీలించే పనిలో బిజీగా ఉన్నారట క్రిష్ అండ్ టీమ్.
ఈ లిస్టులో యంగ్ హీరో శర్వానంద్, రానా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ తదితర పేర్లు విన్పిస్తున్నాయి. మరోవైపు సూపర్‌స్టార్ మహేష్‌బాబు పేరు కూడా వినిపిస్తోంది. కృష్ణ పాత్ర కోసం ఆయనను ఒప్పించే పనిలో ఉందట చిత్ర యూనిట్. అలాగే సీనియర్ నటుడు మోహన్‌బాబు 'ఎన్టీఆర్' బయోపిక్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించనున్నారనీ తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధం వున్న వ్యక్తుల్లో మోహన్‌బాబు ఒకరు. సో ఆయన పాత్ర ఖచ్చితంగా ఈ సినిమాలో కీలకం కానుందనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కేవలం తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లో కూడా సుపరిచితుడు. సో ఆయా భాషల నుండి ఇతర నటీ నటుల్ని కూడా ఎంపిక చేసుకునే యోచనలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారట. మొత్తానికి 'ఎన్టీఆర్' బయోపిక్‌లో నటీనటుల లిస్టు ఏమంత ఆషామాషీ కాదండోయ్.
|