'బిగ్‌బాస్' మొదటి సీజన్ ఓన్లీ సెలబ్రిటీలకే అవకాశం కల్పించారు. కానీ రెండో సీజన్‌కొచ్చేసరికి సామాన్యులకూ అవకాశం కల్పించారు. వేలలో ఆడిషన్స్ నిర్వహించి, కేవలం ముగ్గురు సామాన్యులను మాత్రమే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఏక్‌సెప్ట్ చేశారు. ఈ ముగ్గురు సామాన్యులు, సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా, తమ ఓన్ టాలెంట్‌తో ఆడియన్స్‌ని బాగానే ఎంటర్‌టైన్ చేశారు. అయితే ఆ ముచ్చట ఎన్నాళ్లో నిలవనీయలేదు. మొదటి వారమే సామాన్యుల్లో ఒకరైన సంజనను ఎలిమినేట్ చేసేశారు. ఈ ఎలిమినేషన్ వెనక పక్కా ప్లానింగ్, రాజకీయం ఉందనీ హౌస్ నుండి బయటికొచ్చిన సంజన బిగ్‌బాస్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇకపోతే రెండో ఎలిమినేషన్‌గా బయటికి వచ్చిన నూతన్ నాయుడు కూడా సామాన్యుడే. ఈయన ఓ మంచి ఆలోచనతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు.
ప్రజాసేవ చేయాలనే మంచి దృక్పధం ఉన్న నూతన్ నాయుడుని మరి కొంత కాలం బిగ్ హౌస్‌లో ఉంచి ఉండుంటే బాగుండనీ కొందరు ప్రేక్షకులు భావించారు. అయితే హౌస్‌లోని కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎన్నాళ్లు కొనసాగాలి అని జడ్జ్ చేయడంలో టీమ్‌కి గానీ, హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానికి ఎలాంటి ప్రమేయం లేదనీ, అదంతా జస్ట్ ఆడియన్స్ ఓటింగ్‌తోనే సాధ్యపడుతుందనీ నాని పదే పదే చెబుతున్నా, సామాన్యులే ఎందుకు హౌస్ నుండి బయటికి వస్తున్నారనే అనుమానం కొంత మంది ఆడియన్స్‌లో నెలకొని ఉంది. ఈ కోవలో మూడో వారం ఎలిమినేషన్, ఇక హౌస్‌లో మిగిలిన ఒకే ఒక్క సామాన్యుడు గణేష్‌దేనా? లెట్ వెయిట్ ఆండ్ సీ.
|