మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతోన్న తాజా చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించబోయేదెవరంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. 'రంగస్థలం' కోసం పూజా హెగ్దేని తీసుకున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్‌ని తీసుకునే యోచనలో ఉన్నారంటూ, ప్రచారం జరుగుతోంది. తెలుగులో రకుల్ హవా తగ్గిపోయిన ఈ తరుణంలో, చరణ్ సూచన మేరకు ఈ సినిమాతో రకుల్ రీ ఎంట్రీ షురూ కానుందని తెలుస్తోంది. రకుల్ - చరణ్ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఈ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. బాలీవుడ్‌కెళ్లాక రకుల్‌కి ఎంత ప్రయత్నించినా, తెలుగులో అవకాశాలు రావడం లేదు. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తున్నా, ఎందుకో టాలీవుడ్‌కి మాత్రం రకుల్ బోర్ కొట్టేసింది.
అందుకే చరణ్‌లాంటి స్టార్ హీరో సినిమాతో తన రీ ఎంట్రీ షురూ అయితే మళ్లీ ఇదివరకటిలా టాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకోవచ్చనే యోచనలో రకుల్ ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్‌ని రిక్వెస్ట్ చేసి, ఈ సినిమాలో రకుల్ ఛాన్స్ దక్కించుకుందనీ తెలుస్తోంది. ఆ దిశగా రకుల్‌తో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటెం సాంగ్‌ని బోయపాటి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అఫీషియల్‌గా ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ, ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|