బాలీవుడ్‌లో మళ్లీ పెళ్లిసందడి నెలకొందా? అంటే నిజమే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కుర్రాళ్లకు క్రేజీయెస్ట్ హీరోయిన్ అయిన ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకోబోతోందంటూ ఈ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. రేపో మాపో నిశ్చితార్ధం కూడా జరగనుందట అంటూ హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా హాలీవుడ్ టు, బాలీవుడ్ అప్ అండ్ డౌన్ చేస్తున్న ప్రియాంకా చోప్రా హాలీవుడ్ నటుడు కమ్ సింగర్ అయిన నిక్ జోనస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇంతవరకూ అమెరికాలో సాగిన వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు ఫ్లైటెక్కి ఇండియాకి వచ్చేసింది. ఇటీవల నిక్‌ని తనతో పాటు ముంబయ్‌కి తీసుకొచ్చిన ప్రియాంకా చోప్రా తన కుటుంబ సభ్యులకు నిక్‌ని పరిచయం చేసింది. స్నేహితులు, సన్నిహితులకు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది. ప్రియాంకా కుటుంబ సభ్యులు నిక్‌తో ప్రియాంకా పెళ్లికి సుముఖంగా ఉన్నారనీ తెలుస్తోంది.
త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనుందట. ఈ వార్త ఇంతగా హల్‌చల్ చేస్తున్నప్పటికీ, ప్రియాంకా మాత్రం డైరెక్ట్‌గా స్పందించలేదు. ఇటీవల ప్రియాంకా కుటుంబ సభ్యుల్ని ఈ విషయమై సంప్రదించగా, ఇప్పుడే కదా నిక్ పరిచయమైంది. అప్పుడే ఆయన విషయంలో ఓ అభిప్రాయానికి రాలేమని చెప్పారట. ఏమో చూడాలి మరి ప్రియాంకా తీపి కబురు ఎప్పుడు చెబుతుందో. మరోవైపు హాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి తిరిగొచ్చేసిన ప్రియాంకా ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం తన ప్రియుడితో వెకేషన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తోందిలే.!
|