పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా తాజాగా నిశ్చితార్ధం చేసుకున్న రేణూదేశాయ్‌కి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించాడు. ఇదిలా ఉంటే, రేణూదేశాయ్ రెండో పెళ్లిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకర కామెంట్లు చేస్తూ, తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. రేణూదేశాయ్ పెళ్లిపై పవన్ స్పందించిన తీరుకు ఒకింత ఈ ట్రోలింగ్స్‌కి బ్రేక్ పడినా, యాంటీ పవన్ అభిమానులు ఆమెపై ఇంకా కౌంటర్ ఎటాక్ మానలేదు. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక రేణూదేశాయ్ ట్విట్టర్‌కి గుడ్‌బై చెప్పేసింది. ఈ పెళ్లి ప్రేమ పెళ్లి కాదనీ, పెద్దలు కుదిర్చిన వివాహమనీ రేణూదేశాయ్ చెప్పింది. పవన్‌తో విడాకులు తీసుకున్నాక ఒంటరి జీవితాన్ని అనుభవించిన రేణూదేశాయ్ వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆయా సందర్భాల్లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు రేణూకి సూచించిన సలహాల మేరకు ఆమె ఈ రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుందనీ తెలుస్తోంది. మొత్తానికి తన మాజీ భార్య రేణూదేశాయ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నందుకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కొత్త జీవితం బాగుండాలని కోరుకున్నాడు. అలాగే తన కొత్త జీవతంలో గతానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే తాజాగా రేణూదేశాయ్ ట్విట్టర్‌కి గుడ్‌బై చెప్పేసి ఉండొచ్చు.
|