బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మణికర్ణిక'. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ సినిమా విషయంలో పలు రకాలా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. లీడ్ రోల్ పోషిస్తోన్న కంగనా రనౌత్‌తో చిత్ర యూనిట్‌కి పెద్ద తంటా ఏర్పడిందని బాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సినిమాలో కంగనా వేలు పెడుతోందనీ క్రిష్ దర్శకత్వం వహించిన సీన్స్‌ని కంగనా మళ్లీ రీ షూట్ చేస్తోందనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఇటీవల కంగనా బాధ పడలేక సినిమాలో కీలక పాత్రధారి అయిన సోనూసూద్ సినిమా నుండి తప్పుకోవడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. దాంతో క్రిష్ ఇంతవరకూ షూట్ చేసిన సీన్స్‌నన్నింటినీ పక్కన పడేసి, కొత్తగా సీన్స్ రాసి వాటిని కంగనా డైరెక్ట్ చేస్తోందట. దాంతో బడ్జెట్ కూడా తడిపి మోపిడవుతోందట. నిర్మాతలపై కూడా కంగనా పెత్తనం చెలాయిస్తోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఇలాగే కొనసాగితే అసలింతకీ సినిమా రిలీజ్ అయ్యేనాటికి దర్శకుడిగా క్రిష్ పేరు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ని క్రిష్ ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు. అలాంటిది ఈ చిత్రం విషయంలో ఇలా జరగడం బాధాకరమైన అంశమే. చూడాలి మరి సినిమా విడుదలయ్యే సరికి పరిస్థితులు ఎటు నుండి ఎటు మారతాయో.!
|