'శ్రీరస్తు శుభమస్తు' చిత్రంతో మంచి విజయం అందుకున్న దర్శకుడు పరశురామ్ ఇటీవల సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. 100 కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరశురామ్ రేంజ్ మారిపోయింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన 'గీత గోవిందం' సక్సెస్‌తో పరశురామ్‌కి తమ బ్యానర్‌లో మరో చిత్రం చేసే ఆఫర్ ఇచ్చాడు నిర్మాత అల్లు అరవింద్. అయితే ఆ ప్రాజెక్ట్ బన్నీతో ఉండబోతోందని అంతా భావించారు. కానీ అది బన్నీ కాదట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని తెలుస్తోంది.
సాయి ధరమ్‌తేజ్‌కి పరశురామ్ లేటెస్టుగా ఓ కథ వినిపించాడట. ఆ కథ తేజుకి బాగా నచ్చిందట. సరదా సరదా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో ఢీలా పడిపోయిన తేజుకు ఓ మంచి హిట్ కావాల్సి ఉంది. అది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్‌తో అయితే హిట్ పక్కా అనిపిస్తోంది. 'గీత గోవిందం' హిట్‌తో పరశురామ్‌పై మంచి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని పరశురామ్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సి ఉంది. ఆల్రెడీ తేజు నటిస్తున్న 'చిత్రలహరి' సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాతో పాటు, త్వరలోనే పరశురామ్ స్టోరీని కూడా పట్టాలెక్కించే యోచనలో మెగా మేనల్లుడు తేజు ఉన్నట్లు తెలుస్తోంది.
|