నితిన్ హీరోగా వచ్చిన 'లై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్. విడుదలకు ముందు ఈ బ్యూటీ గురించి చాలా చాలా చెప్పుకొచ్చారు. ఎట్ ఏ టైమ్ నితిన్‌తోనే రెండు సినిమాలకు సైన్ చేసింది అమ్మడు. తొలి సినిమాతో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, రెండో సినిమాకి నటిగా కొంత బెటర్ అనిపించుకుంది. కానీ అమ్మడు నటించిన రెండు చిత్రాలూ సక్సెస్ టాక్ సంపాదించుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో మరో అవకాశం రాలేదు.
అయితే తమిళంలో అమ్మడు దూసుకెళ్తోందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరోల సరసన ఆఫర్లు దక్కించుకుంటూ అక్కడ బాగానే పాగా వేసిందనిపిస్తోంది. తెలుగు ఆడియన్స్‌ని అంతగా మెప్పించలేకపోయినా, తమిళ తంబీలకు మాత్రం ఈ బొద్దుగుమ్మ అందం బాగానే ఎట్రాక్ట్ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది మేఘాఆకాష్. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గౌతమ్ మీనన్ - ధనుష్ కాంబో అంటే అంత ఆషామాషీ కాదు. అదే పెద్ద ఆఫర్ అనుకుంటే, మరో స్టార్ హీరో శింబు సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది అందాల మేఘా. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' చిత్రం శింబు హీరోగా తమిళంలో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాష్ ఛాన్స్ కొట్టేసింది.
|