బిగ్‌హౌస్‌లో ఏదైనా జరగొచ్చు. నాని హోస్ట్‌గా ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నడుస్తోన్న బిగ్‌బాస్ రియాల్టీ షో గురించి తరచూ వినిపిస్తున్న మాట ఇది. ఇంకొంచెం మసాలా అంటూ నాని హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఈ సారి రియాల్టీ షోలోకి కామన్ మేన్‌ని తీసుకొచ్చారు. నూతన్ నాయుడు, గణేష్ ఆ కామన్ మెన్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారనీ బుల్లితెర వీక్షకులు భావించారు. గణేష్‌ని చివరిదాకా భరించలేక గతవారం ఎలిమినేట్ చేసేశారు. నూతన్ నాయుడ్ని ముందే ఓ సారి ఇంటికి పంపించేసి, మరో ఛాన్సిచ్చినా కానీ మళ్లీ సాగనంపక తప్పలేదు. వచ్చాడు. వెళ్లాడు మళ్లీ వచ్చాడు మళ్లీ వెళ్లాడు. మళ్లీ మళ్లీ వచ్చాడు.
మళ్లీ మళ్లీ వెళ్లాడు. ఈ దెబ్బకి బిగ్‌బాస్ షో మీద క్యూరియాసిటీ తగ్గిపోయింది జనానికి. రీ ఎంట్రీ ఛాన్స్ భానుశ్రీకి కానీ, తేజస్వికి కానీ ఇచ్చి ఉంటే ఆ అవకాశాన్ని వారిద్దరూ సద్వినియోగం చేసుకునేవారేమో. కామన్‌మెన్ 80 రోజుల తర్వాత ఎలిమినేట్ అయిపోవడంతో వారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు పంపించారు? అనే చర్చకు ఆస్కారం కల్పించినట్లే అయ్యింది. అమిత్‌ని సేవ్ చేయడం కోసం బలవంతంగా నూతన్‌ని బయటకి పంపారనీ విమర్శలు వస్తున్నాయి. గాడ్ ఓన్లీ నోస్ ఎవ్రీథింగ్. అంతిమంగా ఇది జస్ట్ ఓ టెలివిజన్ షో. ఇదొక రియాల్టీ షో. బుల్లితెర వీక్షకుల్ని కాసేపు రూపొందింది మాత్రమే. దీంట్లో లాజిక్స్ ఉండవు.
|