Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
penimiti kosam its not only a song

ఈ సంచికలో >> సినిమా >>

హాట్‌ హాట్‌ అందాల అనుపమా

hot hot beauty anupama parameshwaran

ప్రేమమ్‌ సినిమాతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. 'శతమానం భవతి' సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పుడు 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంతో మరోసారి తన టాలెంట్‌ని డిఫరెంట్‌గా ప్రొజెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో అనుపమాని హాట్‌ హాట్‌గా చూపించారు. ఇంత వరకూ అనుపమాలో హాట్‌ యాంగిల్‌ అంతగా చూసింది లేదు ఆడియన్స్‌. అమ్మడు డైరెక్ట్‌గా చెప్పేసింది కూడా తన నుండి గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయొద్దని. అయితే ఈ సినిమాతో అనుపమా సడెన్‌ షాక్‌ ఇచ్చింది. తన లోని హాట్‌ యాంగిల్‌ని బయటికి తీసింది.

టీజర్‌ విషయానికి వస్తే, ఓ స్టూల్‌పై వెనక్కి తిరిగి కూర్చుని జుట్టు ఆరబెట్టుకుంటున్న అమ్మాయి.. అందమైన నడుము.. వెనక ఓ అబ్బాయి. ఆ అబ్బాయి కొంటె చూపులు ఆ అమ్మాయి నడుమును తాకుతుంటే, సిట్యువేషన్‌కి తగ్గట్లుగా డైలాగులు. చూసేశావా? ఎలా ఉంది.? అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు హాట్‌గా ఉంది అంటూ అబ్బాయి చెప్పిన డైలాగులు.. ఇంతకీ వారు మాట్లాడుకున్నది కాఫీ కోసం అయితే జనానికి కనెక్ట్‌ అయ్యింది మరోలా.. రొమాంటిక్‌గా. మొత్తానికి టీజర్‌లో అనుపమా అందాలు ప్రత్యేక హైలైట్‌ అయ్యాయని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాణ్‌లా హీరో రామ్‌ ఇచ్చిన రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ని కట్టి పడేస్తున్నాయి. నక్కిన త్రినాధ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
mr. majnu back with full josh