Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mega and power mega stars at azarbaizan

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌ బాస్‌.. సామ్రాట్‌ సేఫ్‌

big boss-samrat safe

బిగ్‌ బాస్‌ సీజన్‌ టూ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ నుంచి సామ్రాట్‌ తప్పించుకున్నాడు. ఈ వారం హోరా హోరీగా జరిగిన టాస్క్‌ లలో సామ్రాట్‌ విజయం సాధించడంతో, ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు తగినంత ఇమ్యూనిటీ లభించినట్లు బిగ్‌ బాస్‌ ప్రకటించారు. అయితే ఆయా టాస్క్‌లలో సామ్రాట్‌ పడ్డ కష్టం కంటే, కౌశల్‌ మీద ఇతర హౌస్‌ మేట్స్‌లో వ్యతిరేకతను క్రియేట్‌ చేయడం, వారి సెంటిమెంట్‌ ని క్యాష్‌ చేసుకోవడం ద్వారానే సామ్రాట్‌ సేవ్‌ అవగలిగినట్లు భావించాలేమో. బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో ఏం చేసినా, అదంతా గేమ్‌లో భాగమే కాబట్టి, సామ్రాట్‌ని తప్పు పట్టలేం.

అయితే ఎగ్స్‌ ఎపిసోడ్‌లో మాత్రం, రోల్‌ రైడా ని ఔట్‌ చేసేందుకు సామ్రాట్‌ ఆడిన ఫేక్‌ గేమ్‌ విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం హైలైట్‌ సీన్స్‌లో కౌశల్‌ వర్సెస్‌ ఇతర హౌస్‌ మేట్స్‌ మధ్య గొడవను ప్రముఖంగా చెప్పుకోవాలి. తనను అందరూ టార్గెట్‌ చేయడంపై కౌశల్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ, 'కుక్కల్లా మీద పడి పోతున్నారు' అనే మాట వాడటంతో బిగ్‌ హౌస్‌లో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కి పోయింది. ఆ తర్వాత టాస్క్‌ లలో హౌస్‌ మేట్స్‌ బిజీ అయి పోయారు. రిఫ్రిజిరేటర్‌ టాస్క్‌తో హౌస్‌ లోని వేడి వాతావరణం చల్ల బడి, నవ్వులు పూయించింది.

 

మరిన్ని సినిమా కబుర్లు
asian group enters movie production