Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నన్ను దోచుకుందువటే చిత్రసమీక్ష

nannudochukunduvate movie review

చిత్రం: నన్ను దోచుకుందువటే 
తారాగణం: సుధీర్‌బాబు, నభా నటేష్‌, నాజర్‌, తులసి తదితరులు 
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌ 
సినిమాటోగ్రఫీ: సురేష్‌ రగుతు 
నిర్మాత: సుధీర్‌బాబు 
దర్శకత్వం: ఆర్‌ఎస్‌ నాయుడు 
నిర్మాణం: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 21 సెప్టెంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే..

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే కార్తీక్‌, మేనమామ కూతురు సత్యతో పెళ్ళి ఇష్టం లేక, సిరి అనే అమ్మాయిని ప్రేమించానని తల్లిదండ్రులతో అబద్ధం చెబుతాడు. మరోపక్క మేఘన (నభా నటేష్‌) అనే అమ్మాయిని సిరి పాత్రలో నటించమని ఒప్పిస్తాడు కార్తీక్‌. ఇంతకీ కార్తీక్‌కి సత్య అంటే ఎందుకు ఇష్టం లేదు? నటించడానికి వచ్చిన మేఘనతో కార్తీక్‌కి వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి కార్తీక్‌ ఎలా బయటపడ్డాడు? కార్తీక్‌ ఎవర్ని పెళ్ళాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

స్టైలింగ్‌, యాక్టింగ్‌లో ఇప్పటికే పెర్‌ఫెక్షన్‌ సాధించేశాడు సుధీర్‌బాబు. సినిమా సినిమాకీ నటనలో మెచ్యూరిటీని ప్రదర్శిస్తోన్న సుదీర్‌, కార్తీక్‌ పాత్రలో చెలరేగిపోయాడు. ఆఫీస్‌లో తన కింద పనిచేసే సిబ్బందిని గదమాయించే బాస్‌లా గాంభీర్యం ప్రదర్శిస్తూనే, అందులోంచీ కామెడీ పుట్టించాడు. సుధీర్‌బాబు వన్‌ మ్యాన్‌ షో అనడం అతిశయోక్తి కాదు.

నటిగా తొలి సినిమాతోనే నటనలో మేటి అన్పించుకుంది నభా నటేష్‌. క్యూట్‌గా హాట్‌గా నభా నటేష్‌ అలరించింది. నటనలో మెప్పించి, గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు దక్కుతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. మిగతా పాత్రధారుల్లో నాజర్‌ తన అనుభవాన్ని రంగిస్తే, మిగిలినవాళ్ళంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

కథ కొత్తదేమీ కాదు. కానీ, కథనం విషయంలోనే దర్శకుడు చురుగ్గా వ్యవహరించాడు. సంగీతం బాగానే వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. ఎడిటింగ్‌ విషయానికొస్తే, సెకెండాఫ్‌లో ఇంకాస్త కత్తెర పదును చూపించాల్సి వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ కూడా మంచి ఔట్‌పుట్‌నే ఇచ్చాయి.

సరదా సరదాగా ఫస్టాఫ్‌ సాగిపోతుంది. దాంతో సెకెండాఫ్‌లో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆశిస్తారు ఆడియన్స్‌. అయితే, సెకెండాఫ్‌లో సన్నివేశాలు సాగతీతలా అన్పించడంతో సినిమా వేగానికి బ్రేకులు పడ్డట్లనిపిస్తుంది. దర్శకుడు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నాడు. హీరో, హీరోయిన్ల నుంచి పెర్ఫామెన్స్‌ని బాగానే రాబట్టిన దర్శకుడు, టెక్నీషియన్ల నుంచీ మంచి ఔట్‌పుట్‌ రాబట్టడంలో సఫలమయ్యాడు. అయితే సెకెండాఫ్‌ మీద ఇంకాస్త ఫోకస్‌ పెట్టి, బెటర్‌గా మలచి వుండాల్సింది. మొత్తంగా చూస్తే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలానే వుంది.

అంకెల్లో చెప్పాలంటే..

2.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే

నటీనటులు బాగానే దోచేసుకున్నారు!

మరిన్ని సినిమా కబుర్లు
antaku minchi churaka