Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hot hot beauty anupama parameshwaran

ఈ సంచికలో >> సినిమా >>

ఫుల్‌ జోష్‌తో 'మిస్టర్‌ మజ్ను' వచ్చేశాడు

mr. majnu back with full josh

అక్కినేని అందగాడు అఖిల్‌ నటిస్తున్న ముచ్చటగా మూడో చిత్రం టైటిల్‌ని రిలీజ్‌ చేశారు. టైటిల్‌తో పాటు చిన్నపాటి టీజర్‌ని కూడా విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా బుధవారం టైటిల్‌ లోగోతో కూడిన అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 'మిస్టర్‌ మజ్ను'గా ఈ సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. టైటిల్‌కి తగ్గట్లుగానే అఖిల్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌ అదిరి పోతున్నాయి. పక్కా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టీజర్‌లో అదే కట్‌ చేశారు. ఎటు చూసినా అమ్మాయిలు.. ఆ అమ్మాయిల మధ్యన అక్కినేని రాకుమారుడు. చుక్కల్లో చంద్రుడిలా అదిరి పోతున్నాడు.

టైటిలే మిస్టర్‌ మజ్ను. మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఫుల్‌ రొమాన్స్‌. హ్యాండ్‌సమ్‌ అండ్‌ చాక్లెట్‌ బోయ్‌ అఖిల్‌. ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. భారీ అంచనాలతో విడుదలైన తొలి సినిమా 'అఖిల్‌' డిజాస్టర్‌ కావడం, రెండో సినిమా 'హలో' ఫర్వాలేదనిపించడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్‌ కావడం లేదు. కానీ, ఫస్ట్‌లుక్‌ వచ్చాక ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. యూత్‌కి కరెక్ట్‌గా కనెక్ట్‌ అయ్యే క్యారెక్టర్‌లో అఖిల్‌ కనిపిస్తున్నాడు. 'తొలిప్రేమ'తో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో అఖిల్‌తో జత కడుతోంది. డిశంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చు యోచనలో ఉంది చిత్ర యూనిట్‌. ఈ సినిమాతో అఖిల్‌ మరంచి కమర్షియల్‌ హిట్‌ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
mega and power mega stars at azarbaizan