Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

హలో గురూ ప్రేమ కోసమే చిత్రసమీక్ష

hello guru premakosame movie review

చిత్రం: హలో గురూ ప్రేమ కోసమే 
తారాగణం: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, ప్రకాష్‌ రాజ్‌, మహేష్‌, సితార, వి.జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి చక్రవర్తి 
నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌ 
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
సమర్పణ: దిల్‌ రాజు 
విడుదల తేదీ: 18 అక్టోబర్‌ 2018 
కుప్లంగా చెప్పాలంటే.. 
ఉద్యోగం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్‌కి బయల్దేరతాడు సంజూ (రామ్‌). తల్లిదండ్రులు అతన్ని గారాబంగా పెంచుతారు. హైద్రాబాద్‌ ప్రయాణంలో సంజూకి అనుపమ (అనుపమ పరమేశ్వరన్‌) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెను ఇషష్ట్ర్టపడతాడతను. మరోపక్క హైద్రాబాద్‌లో విశ్వనాథ్‌ (ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో అతిథిగా దిగుతాడు సంజూ. విశ్వనాథ్‌ కూతురే అనుపమ. ఆ విషయం సంజూకి ఆ తర్వాత తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ట్రైనింగ్‌ సెంటర్‌లో రీతూ (ప్రణీత)ని చూసి ఆమెతో లవ్‌లో పడతాడు. ఇంతలోనే తాను అనుపమని ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంటాడు. కానీ అనుపమకి కార్తీక్‌ (నోయల్‌)తో నిశ్చితార్థమవడంతో, తన ప్రేమని సంజూ ఎలా గెలిపించుకున్నాడన్నది మిగతా కథ. 
మొత్తంగా చెప్పాలంటే.. 
ఈ తరహా పాత్రలు రామ్‌కి కొట్టిన పిండి. టైలర్‌ మేడ్‌ పాత్రలంటామే.. అలాగన్నమాట. ఇకనేం, చాలా తేలిగ్గా చేసుకుపోయాడు. సంజూ పాత్రలో రామ్‌ని చూస్తోంటే, ఆద్యంతం ఆ పాత్రే కన్పిస్తుంది తప్ప, రామ్‌ కన్పించడు. ఎనర్జీ రామ్‌కి అదనపు ఆకర్షణ. అన్ని సన్నివేశాల్లోనూ కంప్లీట్‌ ఎనర్జీతో అలరించాడు. హీరోయిన్లను ఆటపట్టించే సన్నివేశాల్లోనూ, కామెడీ టైమింగ్‌లోనూ, డాన్సుల్లోనూ.. రామ్‌ అదరగొట్టేశాడంతే. 
అనుపమ అందంగా వుంది. అయితే, ఆమె పాత్రను ఇంకాస్త బలంగా మార్చి వుండాల్సింది. వున్నంతలో అనుపమ చాలా బాగా చేసింది. డాన్సుల్లో రామ్‌తో పోటీ పడింది. ఈ విషయంలో అనుపమని అభినందించాల్సిందే. 
మరో హీరోయిన్‌ ప్రణీత తెలుగు తెరపై కన్పించి చాలాకాలమే అయ్యింది. కొన్ని సన్నివేశాల కోసమే ఆమె పాత్ర.. అన్నట్టుంది. వున్నంతలో బాగానే చేసింది. ప్రకాష్‌రాజ్‌, హీరోయిన్‌ తండ్రి పాత్రలో కన్పించి, మెప్పించారు. హీరోయిన్‌ తండ్రి అనడం కంటే, హీరో స్నేహితుడు అనడం కరెక్టేమో అన్పిస్తుంది చాలాసార్లు. హీరో - హీరోయిన్‌ కెమిస్ట్రీ కంటే, హీరో - ప్రకాష్‌ రాజ్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. రామ్‌ - ప్రకాష్‌ రాజ్‌ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ మాటకొస్తే హీరోయిన్‌తో హీరో వున్న సన్నివేశాల కంటే ఇవే ఎక్కువేమో.! మిగతా పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పిస్తాయి. 
కథ కొత్తదేమీ కాదు. చాలాసార్లు చూసేసిందే. కథనం పరంగానూ కొత్తదనం ఏమీ లేదు. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ ఓకే, అక్కడక్కడా ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా తెరకెక్కింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. 
ఓ సాధారణ కథకి, తగినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి హిట్లు కొట్టడం సగటు తెలుగు సినిమా ఫార్ములాగా మారిపోయింది ఈ మధ్య. అయితే ఆ కోవలో అన్ని సినిమాలూ విజయం సాధించకపోవడానికి కారణం, కామెడీ సరిగ్గా వర్కవుట్‌ కాకపోవడమే. కానీ, ఇక్కడికొచ్చేసరికి కథ ఎలా వున్నా, కామెడీతో ఎట్రాక్ట్‌ చేయడం దర్శకుడి పనితనానికి నిదర్శనం. అందుకు నటీనటుల ప్రతిభ బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా రామ్‌ - ప్రకాష్‌ రాజ్‌ మధ్య సన్నివేశాలు ఎంటర్‌టైనింగ్‌గా, కాస్త కొత్తగా అన్పిస్తాయి. ఎందుకంటే ఈ తరహా పాత్రల్ని, సన్నివేశాల్ని చాలా అరుదుగా చూస్తుంటాం. హీరోయిన్‌ని ఇంకాస్త బాగా వాడుకుంటే బావుండేదన్పిస్తుంది. వినోదానికి ఢోకా లేకపోవడం ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. ఓవరాల్‌గా పండక్కి, కామెడీతో మెప్పించే సినిమానే అన్న భావన కలిగిస్తుంది. 
అంకెల్లో చెప్పాలంటే.. 
3.25/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
సరదా సరదా లవ్‌ స్టోరీ గురూ

మరిన్ని సినిమా కబుర్లు
churaka