ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండో పార్ట్ అయిన 'మహానాయకుడు'ని రిలీజ్ చేసేందుకు ఫిబ్రవరి 22 డేట్ ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయాలి. కానీ కుదరలేదు. తర్వాత 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అది కూడా కుదరలేదు. ఎట్టకేలకు ఈ నెల 22న ఎన్టీఆర్ మహానాయకుడుని విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు' రిజల్ట్ బెడిసికొట్టడంతో 'మహానాయకుడు' రిలీజ్‌పై పలు అనుమానాలు నెలకొన్నాయి. మొత్తానికి రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ఆ అనుమానాలు పటాపంచలైపోయాయి. అయితే ఈ సినిమాని బాలయ్య స్వయంగా విడుదల చేస్తున్నారు.
బయ్యర్స్‌తో బాలయ్యకు పలు రకాల గొడవలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. దాంతో ఎలాగైనా ఈ సినిమాని విడుదల చేయాలని చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సినిమాకి బాలయ్యే నిర్మాత కూడా. క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. 'కథానాయకుడు' రిజల్ట్ చూశాక, 'మహానాయకుడు'లో చిన్న చిన్న మార్పులు చేసి రీషూట్స్ నిర్వహించారట. అందుకే విడుదల ఆలస్యమైందనే వాదన మరోవైపు ఉంది. అలాగే బయ్యర్లతో గొడవల కారణంగా కూడా ఈ సినిమా విడుదల లేటయ్యిందనే వాదన మరో వైపుంది. మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక ఎన్టీఆర్ అభిమానులు ఊరట పొందారు. కానీ రిలీజ్ డేట్ అయితే ఫిక్సయ్యింది. రిజల్ట్ ఎలా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది.
|