అతి త్వరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అరదులో ఎన్టీఆర్ జీవిత గాధగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ ఒకటి, ఈ బయోపిక్‌లో రానా చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడు. సంచలన దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో మరో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం వర్మ ఓ వ్యక్తిని చంద్రబాబు పాత్ర కోసం తెరపైకి తీసుకొస్తున్నాడు హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తి వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అచ్చు చంద్రబాబులాగే ఉన్న ఈ వ్యక్తిని వర్మ తన సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మరోవైపు చంద్రబాబు బయోపిక్ అంటూ రూపొందుతోన్న మరో సినిమాలో చంద్రబాబు పాత్రను ఇంకో కొత్త వ్యక్తి పోషిస్తున్నాడు. అయితే ఆ సినిమాపై కొంత గందరగోళం నెలకొంది. ఇకపోతే ప్రస్తుతం వర్మ ఎన్టీఆర్, క్రిష్ ఎన్టీఆర్ ఈ రెండూ హాట్ టాపిక్‌గా నిలిచాయి. క్రిష్ 'ఎన్టీఆర్'లో నటుడిగా రానా ఏంటో అందరికీ తెలుసు. కానీ వర్మ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ కొత్త వ్యక్తి ఎవరో తెలీదు. అతని నటన ఎలా ఉంటుందో తెలీదు. మొత్తానికి 'ఎన్టీఆర్' బయోపిక్స్ ఇచ్చే సర్‌ప్రైజ్‌లు చాలా కొత్తగా ఉండబోతున్నాయని చర్చించుకుంటున్నారు. క్రిష్ 'ఎన్టీఆర్' భారీ కాస్టింగ్‌తో, భారీ బడ్జెట్‌తో ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. ఇక వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది.
|