మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి దర్శకుడిగా మంచి పేరుంది. అభిమానులు, ఆయన కింద పని చేసే టెక్నీషియన్లు ఆయన్ని 'గురూజీ' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. అయితే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో త్రివిక్రమ్‌ని తనకు గురువు, స్వామి అంటూ అభివర్ణించడం ఆశ్చర్యకరంగా ఉంది. అవును నిజమే, త్రివిక్రమ్ తనతో పని చేసిన హీరోలతో ఎమోషనల్‌గా బాండింగ్ ఏర్పర్చుకుంటాడు. గతంలో ఆయనతో పని చేసిన మహేష్, పవన్ ఇలా తదితర హీరోలు ఇదే మాట చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చింది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్న ఎన్టీఆర్‌కి ఆ అవకాశం ఇప్పుడు కుదిరింది. 'అరవింద సమేత..'తో ఆ కోరిక నెరవేరింది ఎన్టీఆర్‌కి. ఈ సినిమా ఎన్టీఆర్‌కి చాలా చాలా ప్రత్యేకం. ఇటీవల ఎన్టీఆర్ జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన ఆయనను మానసికంగా కుంగదీసింది. అలాంటి తరుణంలో త్రివిక్రమ్‌తో 'అరవింద' సినిమా చేయడం, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక్కోసారి తనకెలా నటించాలో తెలియని అయోమయంలో పడిపోయిన సందర్భాలొచ్చాయట.
అలాంటి సందర్భాల్లో తనను వెన్ను తట్టి ఆ సన్నివేశంలో ఎలా నటించాలో తెలియచెప్పిన త్రివిక్రమ్ తనకు గురువు అని ఎన్టీఆర్ చెప్పడం అభిమానుల్ని కలచివేస్తోంది. మామూలు సాదా సీదా హీరో ఇలా చెప్పాడంటే అది వేరు. కానీ ఎంతో స్టార్‌డమ్ ఉండీ, నటనలో దిగ్గజం అయిన ఎన్టీఆర్ నోట ఇలాంటి పలుకులు రావడం, త్రివిక్రమ్ పట్ల ఎన్టీఆర్‌కున్న గౌరవంగా భావించాలి. అలా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌కి ఏర్పడిన అనుబంధం గొప్పది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అరవింద' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.
|