Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీరెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ.

Sri Reddy Political Entry.

ఏంటీ.? శ్రీరెడ్డి రాజకీయాల్లోకి వస్తుందా.? అంతలా ఆశ్చర్యపోకండి. ఈ ఎంట్రీ ఆ ఎంట్రీ కాదులెండి. మొన్నామధ్య టాలీవుడ్‌ ప్రముఖులపై కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో ఆసభ్యకరమైన ఆరోపణలు చేసి, తెలుగు ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చిన శ్రీరెడ్డిని అప్పుడే అంతగా మర్చిపోరులెండి. అర్ధ నగ్న ప్రదర్శన చేసి, అనవసర ఆరోపణలతో పాటు నోటికొచ్చినట్లు దుర్భాషలు ఆడిన శ్రీరెడ్డికి అంత సీను లేదని ఎప్పుడో తేలిపోయింది. టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు మెల్ల మెల్లగా కోలీవుడ్‌నీ, బాలీవుడ్‌ని కూడా తాకిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ శ్రీరెడ్డి గోలేంటా? అనుకుంటున్నారా? అవును ఖాళీగా ఉన్న శ్రీరెడ్డి ఫ్రెష్‌గా మరో స్కెచ్‌ వేసింది. ఆమె ఆరోపణలు సినీ రంగం నుండి, రాజకీయ రంగాన్ని తాకాయి. తాజాగా ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడిపై శ్రీరెడ్డి లైంగిక ఆరోపణలు చేసింది. సదరు నాయకుడు తనని హోటల్‌ రూమ్‌కి రమ్మన్నాడనీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ శ్రీరెడ్డి ఆరోపించింది.

శ్రీరెడ్డి ఆరోపణల్లో ఏదీ నిరూపణ కాలేదింతవరకూ. అలాగే ఈ తాజా ఆరోపణల్లో కూడా నిజమెంతుందో తెలీదు కానీ, ఎలక్షన్స్‌ సమీపిస్తున్న వేళ ఇలాంటి ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మరి శ్రీరెడ్డి చేసిన ఈ ఆరోపణలు తెలంగాణా రాజకీయాల్లో హీటు పుట్టిస్తాయా? లేదంటే ఎప్పటిలాగే శ్రీరెడ్డి ఆరోపణలకు ఎలాంటి విలువా లేకుండా పోతుందో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
Telangana fighter who stands behind Sikkulu.