Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కొత్త ప్రయాణం మొదలెట్టిన మంచు మనోజ్‌.!

Manchu Manoj on new journey

మంచు మనోజ్‌ రూటే సెపరేటు. నటుడిగా ఆయన దారి విలక్షణ దారి. కథల ఎంపికలో, గెటప్స్‌ ఎంపికలో చాలా చాలా కొత్తగా ఆలోచిస్తుంటాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ గురించి అస్సలెప్పుడే ఆలోచించడు. అందుకే ఆయన సినిమాల్లో కమర్షియల్‌ యాంగిల్‌ తక్కువగా ఉంటుంది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. సామాజిక అంశాల పైనా యాక్టివ్‌గా స్పందిస్తుంటాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. సరే ఈ సంగతి అటుంచితే, మంచు మనోజ్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. రీసెంట్‌గా ఫ్యాన్స్‌కి ఓ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 'కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాను.

ఆ క్రమంలో కొన్ని నెలలు హైద్రాబాద్‌కి దూరంగా ఉంటాను..' అని చెప్పాడు. అలా అని సినిమాలకు దూరం కానని మంచు మనోజ్‌ చెప్పాడు. అసలేంటీ సస్పెన్స్‌.? మంచు మనోజ్‌ ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆ కొత్త ప్రయాణం రాజకీయమే అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. అంటే మంచు మనోజ్‌ పొలిటికల్‌ ఎంట్రీ జరుగుతోందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మంచు మనోజ్‌ తండ్రి మోహన్‌బాబు స్వస్థలం చిత్తూరు. ఒకవేళ అక్కడి నుండి మంచు మనోజ్‌ రాజకీయాలు షురూ చేయనున్నారేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంచు మనోజ్‌ డైరెక్ట్‌గా రాజకీయాలని చెప్పలేదు కానీ, చూడాలి మరి ఆయన కొత్త ప్రయాణం అదేనేమో.! 

మరిన్ని సినిమా కబుర్లు
churaka