Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Find your leader!

ఈ సంచికలో >> సినిమా >>

ప్రేక్ష‌కులను ఆలోచింపజేసే చిత్రం `రంగు

The picture of the audience is the color

`న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో  యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ....

హీరో త‌నీశ్ మాట్లాడుతూ - ``నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌గా.. మా `రంగు` సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, మూడు సాంగ్స్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌కు వ‌న్ మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయనీ, సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని త‌ర్వాత ద్వారా నాకు తెలిసింది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ‌లో ఉన్న లారా అనే వ్య‌క్తి పాత్ర‌లో నేను క‌న‌ప‌డ‌తాను. ప‌దిహేడేళ్ల నుండి ఇర‌వై ఎనిమిదేళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డే పాత్ర నాది. నాలుగు వేరియేష‌న్స్‌తో సాగుతుంది. నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోలు, విల‌న్స్ అంటూ ప్ర‌త్యేకంగా ఉండ‌రు. ప‌రిస్థితుల ప్ర‌భావం క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి మ‌నిషిలో మంచి, చెడు ఉంటాయి. అది ఎదుటి అంశాన్నిచూసే కోణాన్ని బ‌ట్టి తెలుస్తుంది. అలాంటి ప‌రిస్థితులను ఈ సినిమాలో చూపించాం. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆలోచింప‌చేస్తుంది. కార్తికేయ ఈ మూడు నాలుగేళ్లుగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు. ఈ ప్ర‌యాణంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, యోగేశ్వ‌ర శ‌ర్మ‌, ప‌రుచూరి ర‌వి వంటి న‌టీన‌టులు,సాంకేతిక నిపుణుల‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. చాలా ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కార్తికేయ.వి మాట్లాడుతూ - ``న్యూస్ పేప‌ర్‌లో ఓ విష‌యాన్ని చ‌దివి ఆ ఆలోచ‌న‌తో విజ‌య‌వాడ వెళ్లాను. అక్క‌డ లారా అనే వ్య‌క్తి గురించి విష‌యాల‌ను సేక‌రించి దాన్నుండి త‌యారుచేసుకున్న క‌థ. ఇలాంటి ఓ క‌థ‌ను రియలిస్టిక్‌గా క‌న‌ప‌డుతూనే క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఉండేలా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌గారు నాకు స‌హాయం చేశారు. అంత పెద్ద ర‌చ‌యిత‌ల‌తో కల‌సి ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే ఓ చిన్న కుర్రాడి నుండి ఇర‌వై ఎనిమిదేళ్ల యువ‌కుడిగా క‌న‌ప‌డే పాత్ర కోసం త‌నీశ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ఆయ‌న క‌ష్టం రేపు తెర‌పై క‌న‌ప‌డుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ చ‌క్రి ద్వారా నిర్మాత‌లు ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడుల‌ను క‌ల‌వ‌డం నా అదృష్టం. ప్యాష‌న్‌తో సినిమా చేసే నిర్మాత‌లతో క‌ల‌సి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది.. యోగేశ్వ‌ర శ‌ర్మ‌గారు సీతారామ‌శాస్త్రిగారి అబ్బాయి అని నాకు ముందు తెలియ‌దు. ఆయ‌న కంపోజ్ చేసిన `శ్రీకారం చుడుతున్న‌ట్లు...` అనే పాట మాత్ర‌మే విన్నాను. అది నాకు ఎంతో ఇష్ట‌మైన పాట‌.  అలాగే ప‌రుచూరి ర‌వి, ష‌ఫీగారు ఎంతో గొప్ప స‌హ‌కారాన్ని అందించారు. ఇలా స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. డైరెక్ట‌ర్‌గా నాకు జ‌న్మ‌నిచ్చిన నిర్మాత‌ల‌కు రుణ‌ప‌డ్డాను``అన్నారు.

నిర్మాత ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ - ``యు అండ్ మీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ను స్థాపించ‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణం. ఆశ‌యాన్ని బ్ర‌తికించ‌డం. కృష్ణాన‌గ‌ర్‌లో ఆక‌లిని మ‌ర‌చిపోయి ఆశ‌యం కోసం తిరిగే ఎంతో మంది ద‌ర్శ‌కులున్నారు. అటువంటి వారి ఆశ‌యాన్ని బ్ర‌తికించ‌డానికి ఈ సంస్థ‌ను స్థాపించాం. మా బ్యాన‌ర్‌లో 7  సినిమాలుఅండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉండ‌గా.. 30-40 ద‌ర్శ‌కుల‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఈ ఇండ‌స్ట్రీకి ఎంతో మంది నిర్మాత‌లు వ‌స్తుంటారు. పోతుంటారు.. కానీ ఎన్ని దెబ్బ‌లు తిన్నా.. చనిపోయే దాకా నిర్మాత‌గానే ఉండాల‌నుకుంటున్నాను.  

ఈ రంగు సినిమా ద్వారా ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాం. స‌మాజంలో యువ‌త ఎలా బాధ్య‌త‌తో ఉండాలి. స‌మాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్య‌త ఏంటి? .. ఇలా చాలా అంశాల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. త‌ప్ప‌కుండా మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌ర రావు మాట్లాడుతూ - ``ఈ సినిమాను ద‌స‌రా, దీపావ‌ళి మ‌ధ్య‌లో విడుద‌ల చేసేలా ఉన్నారు. ఎలా విడుద‌ల చేసినా సినిమా పెద్ద స‌క్సెస్కావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ ఇది. తీనీశ్‌, ష‌ఫీ, ర‌వి అంద‌రూ అద్భుతంగాన‌టించారు. ఈ యంగ్ టీమ్‌కు నేను, సిరివెన్నెల సీతారామశాస్త్రి మా అనుభ‌వంతో కాస్త తోడ్పాటును అందించాం. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా`` అన్నారు.

న‌టుడు ష‌ఫీ మాట్లాడుతూ - ``రియ‌లిస్టిక్ అప్రోచ్‌. కార్తికేయ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఈ జ‌ర్నీ చాలా సంతోషాన్నిచ్చింది. తనీశ్ పాత్ర అంద‌రికీ గుర్తుండిపోతుంది`` అన్నారు.

నిర్మాత న‌ల్ల అయ్య‌న్న నాయుడు మాట్లాడుతూ - ``రంగు సినిమా కోసం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వంటి వారితో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు కూడా ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. యూత్ ఎలాంటి దారిలో న‌డ‌వాలి అనే విష‌యంతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఉండాల‌నే విష‌యాన్ని కూడా మా `రంగు` సినిమాలో చూపిస్తున్నాం`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ యోగేశ్వ‌ర శ‌ర్మ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు కార్తికేయ‌ల నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థే `రంగు`. చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది. ప‌రుచూరిగారి మాట‌లు, నాన్నగారి పాట‌ల‌తో పాటు. సాయికిర‌ణ్ పాటలు మంచి రీరికార్డింగ్ కుదిరింది. ప‌రుచూరి ర‌విగారు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్ స‌మాజంలో మార్పు కోసం చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా`` అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్ క‌ట‌కం వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు.  తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: శ‌్రీనివాస్ నాయుడు గ‌ల‌భా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్‌: క‌ట‌కం వాసు, సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, సాయికిర‌ణ్‌, సంగీతం:  యోగీశ్వ‌ర శ‌ర్మ‌, ఎడిట‌ర్‌:  పైడి బ‌స్వ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌:  టి.సురేంద‌ర్ రెడ్డి, డైలాగ్స్‌:  ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కార్తికేయ‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam