Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

షేడ్స్‌ ఆఫ్‌ 'సాహో' ఛాప్టర్‌ 1 అద్దిరింది బాస్‌.!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'సాహో'కి సంబంధించి అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు ప్రబాస్‌ పుట్టినరోజు సందర్భంగా 'సాహో' టీజర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చేశారు 'సాహో' టీమ్‌. అబుదాబిలో 30 రోజుల పాటు జరిగిన భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ సన్నివేశాలను ఈ టీజర్‌లో చూపించారు. డిఫరెంట్‌ డిఫరెంట్‌ కార్లను డిజైన్‌ చేసిన విధానం, ప్రబాస్‌ ఛేజింగ్‌ సీన్స్‌ భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని జస్ట్‌ అలా అలా చూపించేశారీ టీజర్‌లో. హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో దుమ్ము దులిపేయనుందనీ టీజర్‌లో పరిచయం చేశారు.

బీభత్సమైన డిజైన్స్‌లో కార్లు, ఛేజింగ్‌ సీన్స్‌ ఈ సినిమాకి ఎంతటి ప్రాధాన్యత కానున్నాయో ఓ మేకింగ్‌ వీడియో ద్వారా ఈ టీజర్‌లో చూపించారు.. బోలెడంత మంది టెక్నీషియన్లు, రిచ్‌ లొకేషన్స్‌ ఇలా ఈ సినిమాకి ఖర్చు చేస్తున్న భారీ బడ్జెట్‌ అంతా ఈ ఫస్ట్‌ టీజర్‌లోనే శాంపిల్‌గా చూపించేశారు. ఇంకేముంది అభిమానులు మామూలుగా ఖుషీ కావట్లేదు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ మేకింగ్‌ వీడియో సూపర్‌ డూపర్‌ అంతే. అయితే ఇక నుండి ఇలాంటి సర్‌ప్రైజ్‌లు చాలానే ఉన్నాయట. సినిమా వచ్చేది 2019లో అయినా కానీ, ఈలోగా 'షేడ్స్‌ ఆఫ్‌ సాహో' పేరిట ఏవో ఒక సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉండాలనీ, ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తూనే ఉండాలనీ చిత్రయూనిట్‌ డిసైడ్‌ అయ్యిందట. అంటే వచ్చే ఏడాదిలో విడుదల కాబోయే 'సాహో' సినిమా ప్రమోషన్స్‌ ఈ ఏడాది నుండే స్టార్ట్‌ అయ్యాయన్న మాట. 

మరిన్ని సినిమా కబుర్లు
NTR bio pic