రాజమౌళి మల్టీ స్టారర్ రేపో మాపో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ డే నుండీ అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'అరవింద సమేత' మూడ్ నుండి బయటికి వచ్చిన ఎన్టీఆర్ జక్కన్న సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో తన ఫిట్‌నెస్ ఎలా ఉండాలన్న అంశంపై తన పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైలర్ స్టీవ్ ల్లాయిడ్‌తో చర్చలు జరుపుతున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ - స్టీవ్ ల్లాయిడ్ ఇటీవల రాజమౌళిని కలిశారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర, గెటప్ ఎలా ఉండబోతోందన్న అంశం ఆధారంగా అందుకనుకూలంగా ఎన్టీఆర్‌కి ఫిట్‌నెస్‌లో ట్రైనింగ్ ఇవ్వాలని సూచించాడు స్టీవ్. ఎన్టీఆర్ పాత్ర విషయమై జక్కన్న స్టీవ్‌కి వివరించినట్లు సమాచారమ్. ఇక చరణ్ విషయానికి వస్తే, బోయపాటి శీను సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. దాదాపు ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చరణ్, రాజమౌళి మల్టీ స్టారర్‌లో జాయిన్ కానున్నాడు. ఆల్రెడీ చరణ్ బోయపాటి సినిమా కోసం వర్కవుట్స్ చేసి, ఫిజిక్‌ని ఫిట్‌గానే మెయింటైన్ చేస్తున్నాడు. సో ఫిట్‌నెస్ పరంగా చరణ్‌కి పెద్దగా ప్రోబ్లమ్ లేదు కానీ, చరణ్ కోసం మరో ఫిట్‌నెస్ టీమ్ వర్క్ చేస్తోందట. ఇకపోతే ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌ల సరసన నటించబోయే ముద్దుగుమ్మలెవరనే విషయం ఇంకా బయటికి రాలేదు. పలువురు ముద్దుగుమ్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇంకా కన్‌ఫామ్ కాలేదు. ఇకపై ఒక్కొక్కటిగా ఈ సినిమా అప్‌డేట్స్ బయటికి రానున్నాయనీ అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారమ్.
|