స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్‌లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వీటిలో బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ కాస్టింగ్‌తో, భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటించే ప్రతీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ప్రముఖ నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతోంది.
ఆల్రెడీ బసవతారకం, ఏఎన్నార్, నారా చంద్రబాబు, అతిలోక సుందరి శ్రీదేవి, దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఇలా తదితర ప్రముఖ పాత్రల చిత్రీకరణ జరిగిపోయింది. ఇక ఈ తరుణంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని తెరపైకి తీసుకొచ్చేశాడు వర్మ. వర్మ తలచుకుంటే రెండు మూడు నెలల్లోనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేయగలడు. అదే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో జరిగేలా ఉంది. లేటెస్టుగా తిరుమలలో శ్రీవారి సన్నిధిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ప్రారంభించేశారు వర్మ. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, జనవరిలో విడుదల చేస్తానని అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. దాంతో క్రిష్‌కి వర్మ గట్టి పోటీకొచ్చేశారు. మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రూపొందిస్తున్న 'లక్ష్మీస్ వీరగ్రంధం' కూడా స్పీడందుకుంది. ఈ చిత్రం కూడా రేపో మాపో సెట్స్‌మీదికెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలా వరుసపెట్టి ఎన్టీఆర్ బయోపిక్స్ నిర్మాణం జోరందుకుంది. వీటిలో క్రిష్ వెర్సస్ వర్మ పోటీ చెప్పుకోదగ్గదిగా భావించాలి. ఎందుకంటే ఈ రెండు చిత్రాలూ విడుదలయ్యేది జనవరిలోనే.
|