హాటెస్ట్ యాంకర్ అనసూయ హాట్ హాట్‌గా ఐటెం సాంగ్ సారీ.. స్పెషల్ సాంగ్‌లో మరోసారి చిందేయనుందట. ఐటెం సాంగ్ అంటే అనసూయ గుస్సా అవుతుంది బాస్ మరి. సో స్పెషల్ సాంగ్ అనాల్సిందే. ఇంతకీ అనసూయ ఏ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌లో మెరవనుందంటే. మళ్లీ మెగా హీరోతోనే. గతంలో మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్‌తో 'విన్నర్' సినిమాలో 'సూయ సూయ సూయ..' సాంగ్‌లో చిందేసింది. తాజాగా వరుణ్‌తేజ్, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమా కోసం మరోసారి ఐటెం గెటప్ వేయనుందట అనసూయ. ఈ సినిమాలో అనసూయకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. సీన్స్‌తో పాటు, అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా ఉందట. లేటెస్టుగా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందనీ, ఇక ప్రమోషన్స్ వేగవంతం చేస్తామనీ, సినమాకి సంబంధించి తాజా తాజాగా అప్‌డేట్స్ రివీల్ చేస్తామనీ ఇటీవల చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ కౌర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|