స్వీటీ బ్యూటీ అనుష్కకి ఇంకా పెళ్లి కాలేదు. మరో ముద్దుగుమ్మ త్రిష పెళ్లి కబురు చెప్పినట్లే చెప్పి పక్కన పెట్టేసింది. నయనతార ఆల్రెడీ లవ్‌లో ఉంది. లవ్ ఉంది, లవర్ ఉన్నాడు. పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదీ సౌత్ క్వీన్. వీరి సంగతిలా ఉంటే, మరో సీనియర్ బ్యూటీ కాజల్ కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. సరికదా పెళ్లికి సంబంధించి ఎలాంటి గాసిప్స్ లేని క్లీన్ ముద్దుగుమ్మ అంటే కాజల్ మాత్రమే. ప్రేమకు సంబంధించి కూడా ఎలాంటి అఫైర్స్ రాలేదు కాజల్‌పై ఇంతవరకూ. అనుష్కకి పలువురు హీరోలతో అఫైర్స్ అంటూ గాసిప్స్ వచ్చాయి. అలాంటి గాసిప్స్ కాజల్ విషయంలో ఎప్పుడూ వినలేదు.
ఇంతకీ కాజల్ పెళ్లెప్పుడు.? సోదరి నిషా అగర్వాల్‌కి పెళ్లి చేసేసింది. పెద్దమ్మ కూడా అయిపోయింది. కానీ తనకింకా పెళ్లి ఈడు రాలేదంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటోంది. అన్నింటికీ మించి కెరీర్ ముగిసిపోయిందనుకున్న టైంలో కాజల్‌కి షాకింగ్ ఛాన్సెస్ దక్కాయి. తెలుగులో మెగాస్టార్‌తో ఛాన్స్ అయినా, తాజాగా తమిళంలో కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2'. కెరీర్ పరంగా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్సే ఇవి. ఇక సినిమాల సంగతిటుంచితే, ఇప్పుడప్పుడే పెళ్లి ఊసు లేదంటూ మరోసారి తప్పించేసుకుంది తెలివిగా చందమామ. మరోవైపు హీరోయిన్ సమంత కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఓ పక్క సినిమాలు, ఇంకో పక్క వైవాహిక జీవితం రెండింటినీ భలే మేనేజ్ చేస్తోంది. అలగే కాజల్ కూడా చేయొచ్చు కదా అని అభిమానులు కాజల్‌కి సలహాలిచ్చేస్తున్నారట.
|