Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Wedding ceremony

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్‌ఆర్‌ఆర్‌' అసలేం జరుగుతోంది.?

RR 'is going on.

టాలీవుడ్‌ మెగా మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చరణ్‌ లీవ్‌లో ఉన్నాడట అంటే నెలరోజులకు పైగా చరణ్‌కి రాజమౌళి సెలవులిచ్చాడట. ఈ నెలరోజుల్లో 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌ ముగించుకుని చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం సంసిధ్దమవ్వనున్నాడట. ఈలోగా ఎన్టీఆర్‌తో షూటింగ్‌ కొనసాగుతుందని సమాచారమ్‌. ఎన్టీఆర్‌ ఆల్రెడీ షూటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి కూడా తెలిసిందే.

అయితే లేటెస్టుగా ఎన్టీఆర్‌ ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. ఇవి 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించినవే అని అంటున్నారు. వాటిల్లో ఎన్టీఆర్‌ చాలా బొద్దుగా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్నాడట. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సమక్షంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడనీ ఈ మధ్య టాక్‌ వినిపించింది. అయితే ఎన్టీఆర్‌ ఫ్రెష్‌ లుక్స్‌ని బట్టి అసలింతకీ ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడా.? లేదా.? ఒకవేళ పాల్గొంటే ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉండబోతోంది ఈ సినిమాలో.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్‌ కాకుండా, మిగతా సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోందేమో అని ఇంకొందరు అంటున్నారు. ఇలా 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కొంత గందరగోళం అయితే బయట కనిపిస్తోంది. రాజమౌళి ఈ గందరగోళంపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, సంక్రాంతి తర్వాతే షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam