సినిమాల్లో పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. పవనిజం పేరుతో ఆయన అభిమానులు చేసే హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఇకపోతే ప్రస్తుతం ఆ సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీ అయ్యారు పవన్‌కళ్యాణ్. 'జనసేన' పార్టీ తరపున ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేస్తుండడంలో కీలక పాత్ర పోషిస్తూ, జనంతో మమేకమవుతున్నారు. ఇదిలా ఉంటే, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒంటరి ఏమాత్రమూ కాదు, మెగా కాంపౌండ్ అంతా ఆయన వెంటే ఉంది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడెందుకు కనిపించడం లేదు అంటే, దేనికైనా ఓ సమయం, సందర్భం రావాలి.
అలా వచ్చిన ప్రతీసారీ మేమంతా ఒక్కటే అని నిరూపించుకుంటోంది మెగా కాంపౌండ్. ఇక అన్న మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌ల మధ్య అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. బయట వినిపించే గాసిప్స్ సంగతి ఎలా ఉన్నా, అన్నయ్యను మరో తండ్రిలా భావిస్తాడు పవన్ కళ్యాణ్. అంతేనా.. రాజకీయాల్లో తన తమ్ముడి సత్తా ఏంటో బాగా తెలుసు చిరంజీవికి. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్ని ఎట్ ఏ టైమ్ మేనేజ్ చేయగల స్టామినా పవన్‌కి ఉంది అని ఎప్పుడో చెప్పేశాడు కూడా. అలాగే బాబాయ్ అంటే చరణ్‌కి ఎంతో అభిమానం. బాబాయ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటాడు. బాబాయ్‌ని ఓ మంచి లీడర్‌గా అభివర్ణిస్తుంటాడు చరణ్. అందుకే బాబాయ్‌కి బిగ్గెస్ట్ ఫాలోవర్ ఈ అబ్బాయ్ అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలకు బాబాయ్‌కి హ్యాట్సాఫ్ చెబుతూ తనదైన శైలిలో స్పందించాడు చరణ్.
|