Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
biggest follower

ఈ సంచికలో >> సినిమా >>

కళ్యాణ్‌రామ్‌ థ్రిల్లర్‌ '118'.!

Kalyanram thriller '118'!

'పటాస్‌' తర్వాత కళ్యాణ్‌రామ్‌కి సరైన హిట్‌ దక్కలేదు. దాంతో ఈ సారి తననుండి రాబోయే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ అవ్వాలనే తపనతో ఉన్నాడు కళ్యాణ్‌రామ్‌. ఆ కోవలోనే కేవీ.గుహన్‌ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ మూవీకి సైన్‌ చేశాడు. లేటెస్టుగా ఈ మూవీ టీజర్‌ని వదిలారు. టీజర్‌ చాలా చాలా బాగుంది. నిజమైన థ్రిల్‌ని టీజర్‌లోనే చూపించేశారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఒకరు నివేదా థామస్‌ కాగా, మరో బ్యూటీ 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలినీ పాండే. ఇక టీజర్‌ విషయానికి వస్తే, టీజర్‌లో షాలినీ పాండేకి చోటు దక్కింది కానీ, నివేదా క్యారెక్టర్‌ని సస్పెన్స్‌గా ఉంచారు.

షాలినీ పాండే, కళ్యాణ్‌రామ్‌ల మధ్య లవ్‌ ట్రాక్‌తో స్టార్ట్‌ అయిన టీజర్‌ ఒక్కసారిగా థ్రిల్లింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. అందుకు కారణం ఓ యాక్సిడెంట్‌. ఆ యాక్సిడెంట్‌ టైమ్‌ 1.18 గంటల సమయం. సో టైటిల్‌కీ, ఈ టైంకీ ఏదో సంబంధం ఉంది. ఇదే పాయింట్‌గా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. యాక్సిడెంట్‌లో హీరోయిన్‌ షాలినీ పాండే గాయాల పాలవ్వడం, హీరో కళ్యాణ్‌రామ్‌ ఆ యాక్సిడెంట్‌కి గల కారణాలేంటనే తెలుసుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్‌లో మునిగిపోవడం ఇదంతా పర్‌ఫెక్ట్‌గా కట్‌ చేశారు టీజర్‌లో. టీజర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతే కాదు ఈ సినిమా కోసం కళ్యాణ్‌రామ్‌ డీప్‌ సీలో డైవింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. చాలా చాలా కష్టపడ్డాడట ఈ సినిమా కోసం. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. చూడాలి మరి '118'తో ఈ నందమూరి హీరో హిట్‌ అందుకుంటాడో లేదో.! 

మరిన్ని సినిమా కబుర్లు
first look so innovetive