Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Kalyanram thriller '118'!

ఈ సంచికలో >> సినిమా >>

కాంతం' ఈ సారైనా కొడుతుందా.

first look so innovetive

'ఒక మనసు' సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసిన మొట్ట మొదటి మెగా హీరోయిన్‌ నిహారిక. అయితే తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు నిహారికకు. దాంతో సెకండ్‌ మూవీకి చాలా గ్యాప్‌ తీసుకుంది. 'హ్యాపీ వెడ్డింగ్‌' అంటూ కొంచెం కొత్త కాన్సెప్ట్‌ అని ఓకే చేసింది. కానీ నిహారికకు అది కూడా కలిసి రాలేదు. ఈసారి మాత్రం ఫుల్‌ గ్రేస్‌తో మై నేమ్‌ ఈజ్‌ 'సూర్యకాంతం' కాస్త జాగ్రత్త నాతో మాత్రం అంటోంది మెగా డాటర్‌ నిహారిక. అంటే నిహారిక తాజా చిత్రం టైటిల్‌ 'సూర్యకాంతం' అన్నమాట. ఈ సారి మాత్రం హిట్‌ ఇవ్వకపోతే అలా ఇలా ఉండదంటోందీ గయ్యాలీ సూర్యకాంతం. అంతేగా మరి సూర్యకాంతం అంటే మన తెలుగు వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది ఆనాటి కాలంలో కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తగారే. అయితే నేటి సూర్యకాంతం మాత్రం తన లవర్‌ని రాచి రంపాన పెట్టేలా కనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌ అయితే చాలా ఇన్నోవేటివ్‌గా డిజైన్‌ చేశారు. రెండు షేడ్స్‌లో నిహారికను చూపించారు. ఒక షేడ్‌లో తన లవర్‌ని ఆప్యాయంగా కౌగిలించుకుంటోన్న నిహారిక. వైట్‌ కలర్‌ కాస్ట్యూమ్‌లో భుజంపై వైట్‌ కలర్‌ టాటూతో చాలా కూల్‌గా కనిపిస్తోంది. ఇక రెండో షేడ్‌ కూడా చూపించేశారండోయ్‌. బ్లాక్‌ కలర్‌ కాస్ట్యూమ్‌, బ్లాక్‌ టాటూతో అబ్బో లవర్‌పై విరుచుకుపడుతోంది. పళ్లు పటపటా కొరుకుతూ, లవర్‌ జుట్టు పీకేస్తోంది. ఇదీ అసలు సిసలు సూర్యకాంతం కథ. ఇలా రెండు షేడ్స్‌లో డిజైన్‌ చేసిన ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాకి మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam