Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mahesh Babu is the thriller.

ఈ సంచికలో >> సినిమా >>

'మణికర్ణిక'గా 'క్వీన్‌' కంగనా రాజసం.!

Queen  as Manikarnika

బాలీవుడ్‌ అందాల భామ కంగనారనౌత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందంతో పాటు, అభినయంలోనూ ఆమె టాప్‌. అలాంటి కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మణికర్ణిక'. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ని లాంఛనంగా విడుదల చేసింది. ట్రైలర్‌లో క్వీన్‌ కంగనా పర్‌ఫామెన్స్‌కి అంతా ఫిదా అయిపోతున్నారు. 'లక్ష్మీభాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ఉన్నంతవరకూ ఈ ఝాన్సీని కాపాడతాను..' అంటూ ఝాన్సీలక్ష్మీభాయ్‌ పాత్రలో కంగనా వందకు వంద శాతం న్యాయం చేసిందనే విషయం ట్రైలర్‌ ద్వారా ఆర్ధమైపోయింది. విజువల్‌గా చాలా గ్రాండియర్‌ లుక్‌లో ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు.

ఝాన్సీకి రాణిగా, భార్యగా, తల్లిగా కంగనా రనౌత్‌ అభినయం, రాజసం అద్భుతంగా ఉన్నాయి. కదన రంగాన బ్రిటిషర్లను చీల్చి చెండాడే యాక్షన్‌ ఘట్టాల్లో ఆమె హావభావాలు న భూతో న భవిష్యతి అనేలా ఉన్నాయి. ట్రైలర్‌ చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. ఇంతవరకూ తాను చూసిన హీరోలందరినీ మించిన హీరోయిజాన్ని కంగనాలో చూశానని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసించారు. ఇలా విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది కంగనా రనౌత్‌. ఈ సినిమా దర్శకత్వంలోనూ కంగనా హస్తం ఉన్న సంగతి తెలిసిందే. టైటిల్స్‌లో డైరెక్షన్‌ విభాగంలో క్రిష్‌ జాగర్లమూడితో పాటు, కంగనా పేరు కూడా ఉండడం కొసమెరుపు. 

మరిన్ని సినిమా కబుర్లు
biggest follower