బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ 'కథానాయకుడు' ఈ సంక్రాంతికి విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 70 కోట్లకు అమ్ముడుపోయిన ఎన్టీఆర్ కథానాయకుడు కేవలం 20 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. 50 కోట్లు నష్టాలు మిగిల్చిన కథానాయకుడు డిస్ట్రిబ్యూటర్స్‌ని పెద్ద మనసుతో ఆదుకునే ప్రయత్నం చేశాడు బాలయ్య. రెండో పార్ట్ 'మహానాయకుడు'ని ఫ్రీగా ఇచ్చేశాడు. నిజానికి 'కథానాయకుడు'తో వచ్చిన నష్టాల్ని 'మహానాయకుడు'తో కవర్ చేయడం అన్నది కష్టమే కానీ, రెండో పార్ట్‌ని ఫ్రీగా ఇచ్చేసి తనవంతు ప్రయత్నం చేశాడు బాలయ్య. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంగా రూపొందిన 'కథానాయకుడు' సినిమాని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు.
కానీ రాజకీయ ప్రస్థానంగా తెరకెక్కుతోన్న 'మహానాయకుడు'పై ఓ మోస్తరు అంచనాలున్నాయి. తొలి పార్ట్ నిరాశపరచడంతో ఆ మోస్తరు అంచనాల్ని అయినా అందుకునేలా రెండో పార్ట్‌లో చిన్నా చితకా మార్పులు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఫిబ్రవరిలో 'మహానాయకుడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫైనల్ పాలిషింగ్‌లో బిజీగా ఉంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి అభిమానులు మెచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను ఫైనల్ చేయడంలో క్రిష్ అండ్ టీమ్ తలమునకలవుతున్నారు.
|