రాజమౌళి మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్' గతేడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' జస్ట్ ఏ స్మాల్ బ్రేక్ తర్వాత వెరీ లేటెస్టుగా మళ్లీ స్టార్ట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో చరణ్, ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. తొలి షెడ్యూల్‌లో కూడా చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వచ్చాయట. అలాగే హైద్రాబాద్‌లోని ఓ సెట్‌లో జరగబోయే షూటింగ్‌లో భాగంగా జక్కన్న మరిన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. ఆల్రెడీ చరణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.
మరి కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ కూడా జాయిన్ కానున్నాడు. మామూలుగా జక్కన్న సినిమాలు అంత త్వరగా పూర్తి కావు. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్' విషయంలో జక్కన్న న్యూ స్ట్రేటజీని ఫాలో చేస్తున్నారు. ఇంపార్టెంట్ సీన్స్‌ని తన సమక్షంలో పూర్తి చేస్తూ, ఇతరత్రా సన్నివేశాల్ని అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో వేరే సెట్‌లో కంప్లీట్ చేస్తున్నాడనీ టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జక్కన్న కంకణం కట్టుకున్నాడనీ తెలియవస్తోంది. ఇక ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నామనీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'బాహుబలి' సినిమా కోసం వాడిన హై టెక్నాలజీకి మించిన అప్‌డేట్ వెర్షన్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడనున్నారట. ఇంతవరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి టెక్నాలజీని వాడింది లేదట.
|