క్రిష్‌తో వివాదం కారణంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు టాలీవుడ్‌లో తెగ మార్మోగిపోయింది. బాలీవుడ్‌లో కొందరు ఈ వివాదం పట్ల కంగనాకి సపోర్ట్‌గా నిలవగా, చాలా మంది యాంటీగా మారిపోయారు. ఇదిలా ఉంటే, కొత్తగా కంగనా టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యకు బాగా సోపేసేస్తోంది. ఎందుకంటారా.? ఇటీవల బాలయ్య నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ రెండు భాగాలు ఫెయిలైన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ పాయింట్‌నే ఆసరాగా తీసుకుని కంగనా గేమ్ ప్లాన్ చేసింది. అయ్యో పాపం బాలయ్యా.! అంటూ బాలయ్యపై సానుభూతి చూపించేస్తోంది. ఏంటీ ఇదంతా నిజమేనా.? అంటే బాలయ్య, కంగనాకి ఛాన్సిచ్చాడేమో అంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కంగనా 'మణికర్ణిక' డైరెక్షన్ నుండి క్రిష్‌ని తప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రిష్ చేపట్టిన ప్రాజెక్ట్ 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ బయోపిక్ దారుణంగా నిరాశపరచడంతో కంగనాకి క్రిష్ ఇంకోసారి దొరికిపోయినట్లైంది. సందు చూసి సంకెక్కాలి అన్నట్లుగా, దారుణంగా క్రిష్‌ని ఆడి పోసేసుకుటూ, బాలయ్యని తెగ పొగిడేస్తోంది. ఇదంతా ఎందుయ్యా అంటే బాలయ్య పక్కన ఛాన్స్ కోసమేనట. గతంలో కంగనా 'ఏక్‌నిరంజన్' సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోసారి సౌత్‌పై కన్నేసినట్లుంది. అందుకు సరైన సమయం ఇదేనని భావించింది కాబోలు. పాపం బాలయ్యకు సోపేసేస్తే తన పని సులువైపోతుందని భావిస్తోంది కాబోలు. ఏది ఏమైనా కంగనా ఎంతకైనా తెగిస్తుందంతే.!
|