Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

118 చిత్రసమీక్ష

118 movie review

చిత్రం: 118 
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, ప్రభాస్‌ శ్రీను, హరితేజ, రాజీవ్‌ కనకాల, విజయ్‌ చందర్‌ తదితరులు. 
సంగీతం: శేఖర్‌ చంద్ర 
సినిమాటోగ్రఫీ: కె.వి. గుహన్‌ 
నిర్మాత: మహేష్‌ కోనేరు 
దర్శకత్వం: కెవి గుహన్‌ 
నిర్మాణం: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 01 మార్చి 2019

కుప్లంగా చెప్పాలంటే.. 
జర్నలిస్ట్‌ గౌతమ్‌ (కళ్యాణ్‌రామ్‌) ఓ వింత సమస్యతో బాధపడుతుంటాడు. అతనికి కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కన్పిస్తుంటుంది. కొంతమంది ఆ అమ్మాయిని చంపాలనుకోవడం, కారుతో సహా ఓ లోయలోకి ఆమెను తోసేయడం.. ఇలా సాగుతుంటుంది ఆ కల. చిత్రంగా కలలో కన్పించిన ప్రదేశాలు గౌతమ్‌కి నిజ జీవితంలోనూ కన్పిస్తుంటాయి. కలలో కనిపించిన కారు, కూడా కన్పిస్తుంది. దాంతో, కలలో వున్న అమ్మాయి కూడా నిజంగానే వుండి వుంటుందన్న నమ్మకానికి వస్తాడు గౌతమ్‌. ఆ అమ్మాయిని అన్వేషించే క్రమంలో గౌతమ్‌ ఎదుర్కొన్న సవాళ్ళేంటి.? అసలు నిజంగానే ఆ అమ్మాయి వుందా? లేదా? ఆ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే..
జయాపజయాలు ఎలా వున్నా, ప్రయోగాల విషయంలో వెనుకాడడు కళ్యాణ్‌రామ్‌. సొంత నిర్మాణంలో సినిమాలు చేసినా, వేరే నిర్మాతలతో సినిమాలు చేసినా కొత్తదనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే కళ్యాణ్‌రామ్‌, ఈసారి మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గతంలో జర్నలిస్ట్‌గా 'ఇజం' సినిమాలో కన్పించిన కళ్యాణ్‌రామ్‌, ఈ సినిమాలో ఇంకాస్త స్టయిలిష్‌గా, మెచ్యూర్డ్‌గా కన్పించాడు. తన పాత్రకు అవసరమైనంత మేర పెర్ఫామెన్స్‌ ఇవ్వడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోయడంలో సఫలమయ్యాడు కూడా.

హీరోయిన్లలో నివేదా థామస్‌కి చిన్న పాత్రే దక్కినా, సినిమాకి ఆమె పాత్రే కీలకం. కన్సించింది కాస్సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువ దక్కినా, షాలిని పాండే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం వుండదు. కానీ, తన నటనతో ఆమె కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

కథ మరీ కొత్తదేమీ కాకపోయినా, ఇంట్రెస్టింగ్‌గా చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. మాటల్లో పెద్దగా మెరుపుల్లేవు. కథనం ఆకట్టుకుంటుంది. సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో ఇన్‌టెన్షన్‌ని ఎలివేట్‌ చేస్తుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. స్వతహాగా సినిమాటోగ్రాఫర్‌ కావడంతో కెవి గుహన్‌ తన స్వీయ దర్శకత్వంలో సినిమాని మరింత అందంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.. తన ప్రత్యేకతను చాటుకున్నాడు కూడా.

లాజిక్‌ని పక్కన పెడితే, స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ సినిమా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. అయితే ఆథ్య (నివేదా థామస్‌) ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ మాత్రం బోర్‌ కొట్టిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఉత్కంఠ సినిమాలో వేగాన్ని పెంచుతుంది. అంతలా సన్నివేశాల్ని బాగా రాసుకున్నాడు దర్శకుడు. అద్భుతమైన విజువల్స్‌ కారణంగా చూపుని తెరపైనుంచి తిప్పుకోలేం. ఫస్టాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌ అన్పిస్తుంటుంది. సెకెండాఫ్‌లోనే కొంత సాగతీత కన్పిస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఓ మంచి అనుభూతిని మాత్రం మిగుల్చుతుంది. ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకోవాలన్న కళ్యాణ్‌రామ్‌ ఆలోచనలకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

అంకెల్లో చెప్పాలంటే..
3/5

ఒక్క మాటలో చెప్పాలంటే
118 - ఓ మంచి థ్రిల్లర్‌ 

మరిన్ని సినిమా కబుర్లు
churaka