బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. ఆ కోవలో ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్స్ సందడి చేశాయి. తాజాగా మరో బయోపిక్ రానుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రాణాల్ని పణంగా పెట్టి, ఎంతో మందిని కాపాడిన ఎన్.ఎస్.జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ రాబోతోంది. 'మేజర్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ బయోపిక్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సోనీ పిక్చర్స్‌తో కలిసి మహేష్‌బాబు తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తొలిసారి మహేష్‌బాబు తన సొంత నిర్మాణంలో వేరే హీరోతో రూపొందిస్తున్న సినిమా ఇది. యంగ్ హీరో అడవిశేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవిశేష్ ఫస్ట్‌లుక్‌ని లేటెస్ట్‌గా విడుదల చేశారు.
ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా అడవిశేష్ తన మనసులోని మాటల్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహేష్‌బాబు ద్వారా తీరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగుతో పాటు, హిందీలోనూ రూపొందుతోంది. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.
|